వైకాపా అధికారంలోకి వస్తే ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ అమలు కోరుతూ.. విజయవాడ ధర్నా చౌక్‌లో ఆరోగ్య కార్యకర్తలు నిరసనకు దిగారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో 5 నుంచి 20 ఏళ్లుగా పని చేస్తున్న వారిని.. వైఎస్సార్ క్లినిక్‌లలో కొనసాగించి, ఉద్యోగ భద్ర కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న 1,959 మంది ఉద్యోగులను.. ఈ నెల 31వ తరువాత వెళ్లిపొమ్మని నోటీసులు జారీ చేయడంపై ఆరోగ్య కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజూ వేల మందికి వాక్సినేషన్ ఇస్తున్న సిబ్బందిని పంపివేయడం సరికాదన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి: