చదువుతోనే వెనుకబాటుతనం,పేదరికం నుంచి బయట పడగలమని ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు షుబ్లీ అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో కొన్ని కమిటీలు ఇచ్చిన నివేదికల ప్రకారం ముస్లిం మైనారిటిలలో పేదరికంతో అత్యంత మంది వెనుకబడి ఉన్నారని చెప్పారు.
వారి స్థితి గతులు మారాలంటే చదువుతోనే సాధ్యమన్నారు. నవంబర్ 8వ తేదీనా విజయవాడ ప్రెస్ క్లబ్లో పేద ముస్లింలకు ఉచితంగా కెరీర్ గైడెన్స్ మార్టీ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్పై అవగాహన చేపడుతున్నామన్నారు. 30 మంది పేద ముస్లిం విద్యార్థులను చదివించే బాధ్యతను చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: