ETV Bharat / city

సైబర్ క్రైమ్ : ఆ ఫోన్​ లిఫ్ట్​ చేస్తే అంతే సంగతి... బ్యాంకు ఖాతా ఖాళీ - సైబర్ క్రైమ్ వార్తలు

మీరు ఆన్​లైన్ జాబ్ సైట్​లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారా? అయితే జాగ్రత్త ..మీకు కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్  ఉద్యోగం ఇప్పిస్తాం... ఆకర్షణీయమైన జీతం.. అంటూ ఫోన్ చేస్తారు. ఇంటర్వ్యూకు రావాల్సి ఉంటుందని నమ్మిస్తారు. అయితే ముందుగా రిజిస్ట్రేషన్ కోసం కొంత నగదు పంపాలని అడుగుతారు. విడతల వారీగా లక్షల్లో దోచుకుంటారు. ఈ వ్యవహారంపై అప్రమత్తంగా లేకుంటే.. ఖాతా ఖాళీ అవుతుందంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

సైబర్ క్రైమ్ : ఉద్యోగమిస్తామని ఫోన్​...నమ్మారో ఖాతా ఖాళీ

author img

By

Published : Jun 15, 2020, 12:34 PM IST

Updated : Jun 15, 2020, 2:36 PM IST

హలో మీరు ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారు. సీనియర్ హైవే ఇంజనీర్ ఉద్యోగానికి అర్హులు. ఆకర్షణీయమైన జీతం ఇస్తామంటూ ఫోన్ చేసి అమాయకులకు ఉద్యోగాలు ఎర వేస్తున్న సైబర్ మోసగాళ్లు లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. విజయవాడలో ఇలాంటి ఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. నగరానికి చెందిన సుధీర్‌ అనే వ్యక్తి జాబ్‌ సైట్​లో బయోడేటాను పొందుపరిచాడు. మీకు సీనియర్‌ హైవే ఇంజినీర్‌గా ఉద్యోగానికి అర్హులను ఫోన్ వచ్చింది. మీ పేరు రిజిస్ట్రేషన్ కోసం నగదు జమ చేయాలంటూ విడతల వారీగా రెండున్నర లక్షల రూపాయలు దోచేశారు.

ఉద్యోగం రాకపోవటంతో బాధితుడికి అనుమానం వచ్చి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు... బాధితుడు డబ్బు జమ చేసిన బ్యాంకు ఖాతాలు దిల్లీ జామ్ తారాకు చెందినవిగా గుర్తించారు. నిందితుని ఖాతాలో ఉన్న 73 వేల నగదును సీజ్ చేసి బాధితునికి డీడీ రూపంలో అందించారు.

మరొక వ్యక్తికి టీసీఎస్​లో ఉద్యోగం ఇప్పిస్తామని ఫోన్ చేశారు. నెలకు రూ.50 వేలు జీతం ఇస్తామన్నారు. ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ రావాల్సి ఉంటుందని తెలిపారు. బాధితుడు అక్కడకి రాలేనని తెలపటంతో విశాఖలో ఏర్పాటు చేస్తానన్నారు. అయితే ముందుగా కొంత నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు. అనుమానం వచ్చిన యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అప్రమత్తం చేయటంతో నగదు జమ చేయలేదు.

ఉద్యోగం కోసం ఎవరైనా డబ్బు చెల్లించాలని కోరితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించి కంపెనీ వివరాలు తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి : 'అక్రమ కేసులన్నింటికీ జగన్ వడ్డీతో సహా మూల్యం చెల్లిస్తారు'

Last Updated : Jun 15, 2020, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.