ఇంటర్ తొలి దశ ఆన్‌లైన్ ప్రవేశాల నమోదు గడువును ఈ నెల 27 వరకూ పొడిగిస్తున్నట్లు ఇంటర్ విద్యా మండలి వెల్లడించింది. 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ నమోదు చేసుకోవచ్చని, విద్యార్థులు, తల్లిదండ్రులకు సందేహాలుంటే 1800 274 9868 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలని సోమవారం ఓ ప్రకటనలో సూచించింది. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50, ఓసీ, బీసీ కేటగిరీ విద్యార్థులు రూ.100 చెల్లించాలని తెలిపింది.
ఇంటర్-2021లో మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా పరీక్షలకు హాజరుకావొచ్చని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఒకటి కన్నా ఎక్కువ సబ్జెక్టులున్నా ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, కళాశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని సోమవారం వెల్లడించింది.
ఇదీ చదవండి: