cyber crime: ఓలా స్కూటర్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్ సైబర్ నేరగాళ్ల పాలిట వరంగా మారింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయమంటూ ఏకంగా నకిలీ యాప్‌నే సృష్టించి అమాయకుల నుంచి బుకింగ్, ఇన్సూరెన్స్ అంటూ వేలు గుంజేస్తున్నారు. విజయవాడకు చెందిన శివకూమార్ ఈ నకిలీ యాప్‌లో పేరు నమోదు చేసుకొని దాదాపు రూ.39 వేల వరకూ డబ్బులు పొగొట్టుకున్నాడు.
యాప్ లోగో ఓలా కంపెనీకి సంబందించిన దానిలో ఉండటంతో మోసపోయినట్లు బాధితుడు తెలిపాడు. అనంతరం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఖాతాదారులు లక్ష్యంగా మోసాలు