ETV Bharat / city

నేటి నుంచే నామినేషన్లు.. ఎలాంటి ఏర్పాట్లూ చేయని జిల్లా అధికారులు - ఏపీ పంచాయతీ ఎన్నికలు తాజా వార్తలు

పంచాయతీ ఎన్నికలపై అదే ఉత్కంఠ. నామినేషన్ల స్వీకరణ రోజు వచ్చినా అదే అస్పష్టత. రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఆదేశాలు, ధిక్కరణలు, కోర్టుల్లో కేసుల దశను దాటి.. నామినేషన్ల రోజూ వచ్చింది. కానీ నామినేషన్ల స్వీకరణకు అధికార యంత్రాంగం ఎలాంటి సన్నాహాలూ చేయలేదు.

నేటి నుంచే నామినేషన్లు.. ఎలాంటి ఏర్పాట్లూ చేయని జిల్లా అధికారులు

author img

By

Published : Jan 25, 2021, 7:13 AM IST

Updated : Jan 25, 2021, 9:05 AM IST

నేటి నుంచే నామినేషన్లు.. ఎలాంటి ఏర్పాట్లూ చేయని జిల్లా అధికారులు

పంచాయతీ ఎన్నికలపై అస్పష్టత నెలకొంది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలూ అందలేదు. మరి నామినేషన్ల ఘట్టంలో తొలి రోజైన సోమవారం ఏం జరగబోతోంది? ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించి తాత్కాలికంగా వాయిదా వేసే అవకాశాలున్నాయా? అని పార్టీలు, ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. తొలి దశలో ఎన్నికలు జరిగే పంచాయతీలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం ఉదయం నుంచి మొదలవ్వాలి. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు ప్రక్రియ జరుగుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈనెల 27 సాయంత్రం 5 గంటల వరకు ౩ రోజుల పాటు నామినేషన్ల దాఖలు దాఖలు ప్రక్రియ కొనసాగనుందని స్పష్టం చేసింది. అయితే నామినేషన్ల స్వీకరణకు ఏ జిల్లాలోనూ సన్నాహాలు జరగలేదు. జిల్లాల అధికార యంత్రాంగంలోనూ ఎలాంటి కదలికా లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసును సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. దీనిపై కోర్టు నుంచి స్పష్టత వచ్చేవరకు ఎన్నికలపై ముందుకు వెళ్లకూడదన్న ధోరణిలోనే ప్రభుత్వం ఉంది. మరోవైపు తెదేపా తదితర విపక్ష పార్టీలు తాము మద్దతిచ్చే అభ్యర్థులతో సోమవారం నుంచే నామినేషన్లు వేయించాలన్న యోచనలో ఉన్నాయి. వారు నామినేషన్లు వేసేందుకు వచ్చినా తీసుకునేందుకు అధికారులు లేకపోతే ఏం జరుగుతుందన్నది వేచి చూడాలి. తొలి దశలో ప్రకాశం, విజయనగరం మినహా 11 జిల్లాల్లోని 146 మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందా? లేదా? అనే విషయమై సందిగ్ధత నెలకొంది.

ఆర్వోల ఎంపికే జరగలేదు

పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదని, వాటిని వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసిన ప్రభుత్వం.. నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని గానీ, నామినేషన్లు స్వీకరించాలని గానీ.. జిల్లా అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఎలాంటి ఉత్తర్వులూ వెళ్లలేదు. ఎస్‌ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఆయా గ్రామాల్లో సర్పంచి, వార్డు సభ్యుల స్థానాల వివరాల్ని రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వోలు) సోమవారం పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డుల్లో ప్రకటించి, నామినేషన్ల స్వీకరణ ప్రారంభించాలి. దీని కోసం జిల్లా, డివిజన్‌ పంచాయతీ కార్యాలయాల నుంచి ఆర్వోలు ఓటర్ల జాబితాలు, నామినేషన్‌ పత్రాలు, ఇతర సామగ్రి తీసుకుని ఆదివారమే నిర్దేశిత గ్రామ పంచాయతీలకు వెళ్లాలి. కానీ అదేమీ జరగలేదు అత్యధిక జిల్లాల్లో ఇప్పటికీ ఆర్వోలు, ఏఆర్వోల ఎంపిక ప్రక్రియే పూర్తి కాలేదు. కొన్ని జిల్లాల్లో జిల్లా పంచాయతీ అధికారులు ఆర్వోలు, ఏఆర్వోల జాబితాలు సిద్ధం చేసినా.. కలెక్టర్లు ఆమోదముద్ర వేయలేదు.

ఎస్‌ఈసీకి సమాచారమివ్వని కలెక్టర్లు

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలకు ఉత్తర్వులు వెళుతున్నాయి. కానీ అటు నుంచి ఎలాంటి స్పందనా ఉండటం లేదు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయడానికి ముందు.. ఆయా జిల్లాల్లో ఏయే రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏయే మండలాల్లో ఎన్నికలు నిర్వహించవచ్చన్న సమాచారాన్ని జిల్లా కలెక్టర్లు ఎస్‌ఈసీకి అందజేశారు. ఆ తర్వాత నుంచి సహాయ నిరాకరణ మొదలైంది. ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ శనివారం తలపెట్టిన వీడియో సమావేశానికి జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు హాజరవలేదు. ఏ మండలాల పరిధిలో ఏయే పంచాయతీలకు సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు? న్యాయపరమైన, ఇతరత్రా కారణాల వల్ల ఎక్కడైనా ఎన్నికలు నిర్వహించడం కుదరడం లేదా? వంటి సమాచారాన్ని, ఆయా పంచాయతీల జాబితాల్ని ఎన్నికల సంఘానికి జిల్లా కలెక్టర్లు పంపించాలి. ఆదివారం సాయంత్రానికి కూడా వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఎన్నికల సంఘం కార్యాలయం మాత్రం ఆదివారం సెలవు దినమైనా పూర్తిస్థాయిలో పనిచేసింది.

అందరి చూపూ సుప్రీం వైపు!

పంచాయతీ ఎన్నికలపై సోమవారం సుప్రీంకోర్టు ఏం చెబుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ శుక్రవారం ఎస్‌ఈసీకి లేఖ రాశారు. ముందు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఎస్‌ఈసీ శనివారం ఉదయం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. హైకోర్టు ఉత్తర్వుల్ని ఎస్‌ఈసీ అమలు చేసిందని, అలాగే సుప్రీంకోర్టు తీర్పునకూ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇదీ చదవండి: సిద్ధంగా ఉన్న అధికారులతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు: వెంకట్రామిరెడ్డి

Last Updated : Jan 25, 2021, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.