కరోనా థర్డ్ వేవ్ (corona third wave) ముప్పు పొంచి ఉన్న తరుణంలో రాష్ట్రాల్లో జరుగుతున్న వైద్య సన్నద్ధతపై జాతీయ వైద్య కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించిందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ (NTR Health university) వీసీ డా. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఇటీవల అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో.. కరోనాను ఎదుర్కోవడానికి అవలంభించవలసిన పలు అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.
పిల్లల కోసం పడకల ఏర్పాటు..
కొవిడ్ థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపడుతోందని వీసి వెల్లడించారు. రాష్ట్రంలోని విజయవాడ, తిరుపతి, విశాఖల్లో చిన్నపిల్లల కోసం ప్రత్యేక ఆసుపత్రుల నిర్మాణానికి అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సారి కరోనా ఎక్కువగా చిన్నపిల్లలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు అనేక సర్వేలు చెప్పడంతో.. దానికి అనుగుణంగా వైద్యసేవలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. దానిలో భాగంగా.. ప్రభుత్వ, ప్రైవేట్ పిడియాట్రిక్ ఆసుపత్రుల్లో సాధ్యమైనన్ని పడకలు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
సుదూరాలకు టెలీమెడిసిన్ సేవలు..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వంద పడకల మేర అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చిన్నారులకు వినియోగించే వెంటిలేటర్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఆసుపత్రుల్లో పిల్లలతో పాటు అటెండెంట్ వారితో ఉండేందుకు పడకలు ఏర్పాటు చేయాల్సిన అవసరముంటుందని వీసీ డా.శ్యామ్ ప్రసాద్ అన్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని పిడియాట్రిక్ (Pediatrician) వైద్యుల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. గైనకాలజీ (gynaecology) వైద్యులకు సైతం థర్డ్ వేవ్ చికిత్స పై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.
మరోవైపు... ఏజెన్సీ ప్రాంతాలు, దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని వారికి వైద్యం అందించేందుకు టెలిమెడిసిన్‌ను బలోపేతం చేస్తున్నామన్నారు. థర్డ్ వేవ్ లో టెలిమెడిసిన్ ఎంతగానో ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. టెలీ మెడిసిన్ (Telemedicine) సేవలు విస్తుతస్థాయిలో అందుబాటులోకి వస్తే ఆసుపత్రుల మీద ఒత్తిగి తగ్గించవచ్చునని ఆయన అన్నారు. రానున్న విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీ చెప్పారు.
ఇదీ చదవండి: