విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పీజీ, ఎంబీబీఎస్ వైద్య విద్యలో చేరే విద్యార్ధులకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుల ఆహ్వానం పూర్తైందని యూనివర్శిటీ అధికారులు చెబుతున్నారు. పీజీలో నాలుగు వేల.. దరఖాస్తులు రాగా 3,538 మంది ఆప్షన్స్ పెట్టుకున్నారని తెలిపారు.
వారిలో 772 మందికి సీట్లు కేటాయించామన్నారు. ఎంబీబీఎస్‌లో చేరేందుకు 13 వేలకు పైగా దరఖాస్తులు అందాయన్నారు. వాటిని పరిశీలించి మొదటి విడత కౌన్సెలింగ్ చేపడతామన్నారు. దరఖాస్తుదారులకు ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేశామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్ తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్ర విభజన తీరుపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి: ఉండవల్లి