Kishore Babu meets Chandrababu: ఎన్ఆర్ఐ తెదేపా యూరప్ బృందం నాయకుడు డాక్టర్ కిషోర్‌బాబు మర్యాదపూర్వకంగా తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. 40వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నెల్లూరు, చిత్తూరు జిల్లా పూతలపట్టు, అమరావతిలో ఎన్ఆర్ఐ తెదేపా యూరప్ బృందం ఏర్పాటు చేసిన అన్నదానం గురించి కిశోర్ బాబు వివరించారు. అలాగే రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాలు, 2024 ఎన్నికల్లో తమ వంతు సహాయంపై చర్చించారు. 2024లో తెదేపా గెలుపే ప్రధానంగా పని చేస్తామని కిషోర్‌బాబు తెలిపారు. త్వరలో ఎన్ఆర్ఐ తెదేపా యూరప్ బృందం ఆధ్వర్యంలో చేయబోయే మహానాడు కార్యక్రమాల గురించి మాట్లాడారు.
తెదేపా 40 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించిన వారికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఉక్రెయిన్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులను సొంత రాష్ట్రాలకు చేరే వరకు ఎన్ఆర్ఐ తెదేపా యూరప్ బృందం చేసిన సహకారాలను ప్రశంసించారు. మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని, సామాజిక కార్యక్రమాలే కాకుండా ప్రతీ ఒక్క ఎన్ఆర్ఐ ఒక వ్యాపారవేత్తగా మారి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని.. నిరుద్యోగ యువతకు ఉద్యోగవకాశాలు కల్పించాలి కోరారు. 2024లో పార్టీ గెలుపుకోసం శ్రమించాలని తెలియచేశారు. సేవా కార్యక్రమాలకు పార్టీ తరుపున ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు: వర్జీనియాలో నిర్వహించే నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు వర్జీనియాలోని ఎన్టీఆర్ అభిమానులు అందరినీ ఆహ్వానించారు.
"మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన యుగ పురుషుడు, నందమూరి తారకరామారావు శతజయంతి ప్రారంభోత్సవ వేడుకలకు తెలుగింటి ఆడపడుచులు, అన్నదమ్ముళ్లను ఆహ్వానిస్తున్నాం. వర్జీనియాలో జరగనున్న అన్న గారి శతజయంతి ఉత్సవాలకు సకుటుంబ సమేతంగా విచ్ఛేయాలి" -వర్జీనియాలోని ఎన్టీఆర్ అభిమానులు
ఇదీ చదవండి: CBN LETTER: జంగిల్ రాజ్ పాలనలో ప్రజలకు భద్రత కరవైంది.. డీజీపీకీ చంద్రబాబు లేఖ