ETV Bharat / city

పేదలపై నాలా పిడుగు... గగ్గోలు పెడుతున్న బాధితులు - AP News

ప్రభుత్వం ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పేద, మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం మోపుతోంది. ‘నాలా’ పన్ను వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది. 2006 తర్వాత భూ మార్పిడి జరిగి, ‘నాలా’ పన్ను చెల్లించని జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అప్పటి నుంచి నాలుగైదు చేతులు మారడంతో.. ఇప్పటి యజమానులు గగ్గోలు పెడుతున్నారు.

tax on non-agricultural land
tax on non-agricultural land
author img

By

Published : Mar 21, 2022, 5:46 AM IST

రాష్ట్రంలో 2006 తర్వాత భూ మార్పిడి జరిగి, ‘నాలా’ పన్ను చెల్లించని జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అప్పటి నుంచి నాలుగైదు చేతులు మారడంతో.. ఇప్పటి యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటివరకు 30వేల మందికి చెందిన 25వేల ఎకరాలను గుర్తించారని, వీటికి రూ.600 కోట్ల వరకు చెల్లించాలని తాజా లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పేద, మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం మోపుతోంది. పన్ను చెల్లించనప్పటి విలువ కాకుండా ప్రస్తుత విలువకు 5% నాలా, మరో 5% జరిమానా విధిస్తోంది. దీనివల్ల చెల్లించాల్సిన మొత్తం లక్షల్లోకి చేరుకుంటోందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూముల విలువలు పెంచడంతో పేదలు, మధ్యతరగతి వారికి నాలా చెల్లింపు భారంగా మారింది. రెవెన్యూ అధికారులు ప్రతి జిల్లాలో భూముల లెక్కలు తీస్తున్నారు. వంద గజాల్లోపు కట్టుకున్న పేదల ఇళ్లకూ నాలా పన్ను నోటీసులు రావడంతో వారు బెంబేెలెత్తిపోతున్నారు. రామవరప్పాడు పంచాయతీ సర్పంచ్‌ సైతం ఇటీవల రూ.4.50 లక్షలు చెల్లించారు. విజయవాడ శివార్లలోని పల్లెలన్నింటిలో నోటీసుల జారీ మొదలైంది.

  • విజయవాడలోని రామవరప్పాడుకు చెందిన ఆటో డ్రైవర్‌ ప్రసాద్‌ 2000 సంవత్సరంలో రామవరప్పాడు వంతెనకు అవతల రూ.3.50 లక్షలతో స్థలం కొని ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆయనకు రూ.2.50 లక్షల నాలా (వ్యవసాయేతర భూమి) పన్ను చెల్లించాలని నోటీసు వచ్చింది. నిర్మాణ సమయంలోనే చెల్లిస్తానని ప్రసాద్‌ తిరిగితే రూ.20వేల వరకు ఉంటుందన్నారు గానీ నోటీసివ్వలేదు. అధికారుల జాప్యం వల్ల ఇప్పుడు ఆయన రూ.2.50 లక్షలు కట్టాల్సి వస్తోంది.
  • విజయవాడ శివారులోని ఓ దుకాణ యజమానికి ఇటీవల షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. ‘మీ ఆధ్వర్యంలోని 387.20 చదరపు అడుగుల వ్యవసాయ భూమి వ్యవసాయేతరంగా మారింది. చదరపు అడుగుకు రూ.14వేల చొప్పున రూ.2.71 లక్షలు చెల్లించాలి. జరిమానాతో కలిపితే రూ.5.42 లక్షలు ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వండి’ అని అందులో పేర్కొన్నారు.
.

ప్రతి ఒక్కరూ చెల్లించాల్సిందే..

ఏటా నాలా వసూలుకు చర్యలు తీసుకుంటాం. ఇదేమీ కొత్త పన్ను కాదు. భూమి విలువ, విస్తీర్ణాన్ని బట్టి చెల్లించాలి. ఎవరికీ మినహాయింపులు లేవు. లక్ష్యం మేరకు పన్ను వసూలు చేయాలని అధికారులకు సూచించాం.- కె.మాధవీలత, జేసీ, రెవెన్యూ, కృష్ణా జిల్లా

ఇదీ చదవండి: ఆ నిధులపై వైకాపా మంత్రులతో చర్చకు సిద్ధం: సోమువీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.