కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయు ఎమ్మెల్సీ స్థానాలకు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే స్వతంత్ర అభ్యర్థులు 14 నామినేషన్లను దాఖలు చేశారు. తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నాలుగు నామినేషన్లు దాఖలు అయ్యాయి. కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పది నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దాఖలు అయిన నామినేషన్ల సంఖ్య 20కి చేరింది. ఫిబ్రవరి 23వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. 26 తేదీన నామినేషన్ల ఉపసంహరకు తుది గడువుగా ఈసీ పేర్కొంది. మార్చి 14 తేదీన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది.
ఇదీ చదవండి: 'మీ కుట్రలు, దుర్మార్గాలకు తెదేపా కార్యకర్తలు భయపడరు'