ETV Bharat / city

NO DSC: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ హామీ.. నెరవేరదేమి? - నెరవేరని ఉపాధ్యాయ పోస్టుల భర్తీ హామీ

వైకాపా అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇంతవరకు డీఎస్సీ ప్రకటించలేదు. తాజాగా ఇచ్చిన ఉద్యోగాల క్యాలెండర్‌లోనూ ఈ నియామకాల ప్రస్తావన లేదు. 2018 తర్వాత నియామకాలకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రతి బడికి ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామని ప్రకటించినా అమలు కాలేదు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సంఖ్య ఎక్కువగా ఉండడం, జిల్లాస్థాయి పోస్టులు కావడంతో ఎక్కువ మంది వీటిపై ఆసక్తి చూపుతారు.

no recruitment of teacher jobs in andhrapradhesh
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ హామీ.. నెరవేరదేమి?
author img

By

Published : Jun 28, 2021, 4:08 AM IST

Updated : Jun 28, 2021, 6:24 AM IST

అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అవసరమైనన్ని ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేస్తాం. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం.

- శ్రీకాకుళం, రాజాం పాదయాత్రలలో జగన్‌

వైకాపా అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇంతవరకు డీఎస్సీ ప్రకటించలేదు. తాజాగా ఇచ్చిన ఉద్యోగాల క్యాలెండర్‌లోనూ ఈ నియామకాల ప్రస్తావన లేదు. ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ ఖాళీల కారణంగా విద్యార్థులకు సరైన విద్య అందని పరిస్థితి నెలకొంది. ప్రాథమిక పాఠశాలల్లో అయిదు తరగతులకు ఒక్కరే టీచర్‌ ఉంటుండగా... ఉన్నత పాఠశాలల్లో చాలాచోట్ల సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత నెలకొంది. 2018 తర్వాత నియామకాలకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రతి బడికి ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామని ప్రకటించినా అమలు కాలేదు. దీంతో ఎనిమిది వేలకుపైగా బడులు ఒక్కో ఉపాధ్యాయుడితోనే కొనసాగుతున్నాయి. ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో 1,795 వరకు సబ్జెక్టు టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. అన్ని స్థాయిల్లో కలిపి 16 వేల వరకు ఖాళీలు ఉన్నాయి. చాలాచోట్ల సాంఘిక, జీవశాస్త్రం ఉపాధ్యాయుల కొరత ఉంది. ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడితో కలిపి తొమ్మిది పోస్టులు ఉండాల్సి ఉండగా... కొన్నిచోట్ల అయిదారుగురు మాత్రమే పని చేస్తున్నారు. ఏకంగా 400 ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులే లేరు. గతేడాది డిసెంబరులో ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా సర్దుబాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ... క్షేత్రస్థాయిలో మాత్రం ఏకోపాధ్యాయ బడుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు 30,367 ఉండగా... వీటిల్లో 33 బడులకు ఒక్క టీచరూ లేరు. ఇవి డిప్యూటేషన్‌పైనే కొనసాగుతున్నాయి. మరో 8,958 పాఠశాలలు ఒక్క ఉపాధ్యాయుడితోనే కొనసాగుతున్నాయి. ఇలా చూసుకున్నా తొమ్మిది వేల మందికిపైగా ఉపాధ్యాయులు అవసరం కానున్నారు. పునాది స్థాయిలో బోధనతోపాటు పర్యవేక్షణ గాడి తప్పుతోంది. ఉపాధ్యాయుడు అత్యవసరంగా సెలవు పెడితే పాఠశాలకు సెలవు ఇవ్వాల్సి వస్తోంది. పక్క పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను పంపిస్తున్నా కొద్దిరోజులే డిప్యూటేషన్‌ కావడంతో కొత్తగా వెళ్లిన టీచర్‌ సరిగా పట్టించుకుంటున్న దాఖలాలు ఉండడం లేదు.

భారీగా పెరిగిన విద్యార్థుల సంఖ్య
గతంతో పోలిస్తే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. పాఠశాల విద్యాశాఖ గణాంకాల ప్రకారం ఆరు లక్షల మందికిపైగా కొత్తగా చేరారు. ఈ లెక్కన పెరిగిన పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు అవసరమవుతారు. రాష్ట్రంలో 1,795 సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కాగితాల్లోనే అధికారుల ప్రతిపాదనలు
ఉద్యోగ క్యాలెండర్‌ కోసం ఖాళీల వివరాలు కోరిన సమయంలో 16 వేల ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. వీటిల్లో ఒక్క సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులే 14,061 వరకు ఉన్నాయి. మిగతా వాటిల్లో సబ్జెక్టు టీచర్‌ పోస్టులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,86,475 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. గత డిసెంబరులో బదిలీలు నిర్వహించిన సమయంలో సుమారు 16 వేల పోస్టులను బ్లాక్‌ చేశారు. ఈ లెక్కన దాదాపుగా ఆ పోస్టులన్నీ ఖాళీలే. డీఎస్సీ-2008కు చెందిన అర్హులైన 2,193 మందిని ఎస్జీటీలుగా నియమిస్తున్నారు. ఈ సంఖ్యను మినహాయించినా.. దాదాపు మరో 12 వేల ఎస్జీటీ పోస్టులు అవసరం కానున్నాయి.

ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. పైపెచ్చు కరోనా తదితర కారణాలతో భారీగా విద్యార్థులు చేరారు. దీంతో ఉపాధ్యాయుల అవసరం మరింత పెరిగింది.

సంస్కరణలతో పోస్టులు దూరం
జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా తీసుకొస్తున్న సంస్కరణలతో ఉపాధ్యాయ పోస్టులు కనుమరుగవుతాయని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో కలిపేస్తే ఇక్కడి పోస్టులు అక్కడికి వెళ్లిపోతాయి. అధికారుల ప్రతిపాదనల ప్రకారం... ప్రీప్రైమరీ 1, 2, ఒకటో తరగతి సన్నద్ధత, 1, 2 తరగతుల పౌండేషన్‌ బడులకు అంగన్‌వాడీ కార్యకర్తలతోపాటు ఒక సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ)ని నియమిస్తారు. మిగతా ఎస్జీటీలను 3, 4, 5 తరగతులతోపాటు ఉన్నత పాఠశాలలకు తరలిస్తారు. అన్ని యాజమాన్యాల్లో కలిపి ఎస్జీటీలు 86 వేల వరకు ఉన్నారు. ఫౌండేషన్‌ బడులు దాదాపుగా 34 వేల వరకు ఏర్పాటు చేసే అవకాశముంది. వీటికి 34 వేల మంది ఎస్జీటీలు సరిపోతారు. మిగతా వారిని ఉన్నత పాఠశాలల్లో నియమిస్తారు. ఈ విధానంతో పోస్టులు ఉండవని నిపుణులు వెల్లడిస్తున్నారు.

కొన్ని నెలల నుంచి అభ్యర్థుల సన్నద్ధం
ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం డీఎస్సీ ప్రకటిస్తుందని లక్షలాది మంది విద్యార్థులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించే ఉద్యోగాల క్యాలెండర్‌లో టీచర్‌ పోస్టులు ఉంటాయనే ఉద్దేశంతో ముందు నుంచే సన్నద్ధమవుతున్నారు. కొందరు అభ్యర్థులు ప్రైవేటు ఉద్యోగాలను సైతం వదిలేసి చదువుతున్నారు. మరికొందరు కోచింగ్‌ తీసుకుంటున్నారు. ఇటీవల పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ జిల్లాల నుంచి ఉపాధ్యాయ ఖాళీలను సేకరించడంతో నిరుద్యోగుల్లో మరింత ఆశ చిగురించింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపాధ్యాయ ఉద్యోగాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ ప్రాంతానికి చెందిన కొందరు అభ్యర్థులు కొన్ని నెలలుగా రాత్రింబవళ్లు చదువుతున్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సంఖ్య ఎక్కువగా ఉండడం, జిల్లాస్థాయి పోస్టులు కావడంతో ఎక్కువ మంది వీటిపై ఆసక్తి చూపుతారు.

క్యాలెండర్‌లో డీఎస్సీ ఊసే లేదు

‘‘ప్రభుత్వ పాఠశాలల్లో 20 వేల వరకు ఖాళీలున్నాయి. ఉద్యోగాల క్యాలెండర్‌లో డీఎస్సీ ఊసే లేదు. ప్రాథమిక స్థాయిలో బోధనకు తీవ్ర సమస్యలు ఏర్పడుతున్నాయి. జాతీయ విద్యా విధానం అమలు పేరుతో ప్రాథమిక విద్యలో తీసుకొస్తున్న సంస్కరణలు విఘాతంగా మారనున్నాయి. ఉపాధ్యాయ పోస్టులు పోతాయి. కేరళ, దిల్లీ తరహాలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసి, తరగతికో ఉపాధ్యాయుడిని నియమిస్తే బలమైన ప్రాథమిక పాఠశాలల వ్యవస్థ వస్తుంది’’.

-షేక్‌ సాబ్జీ, ఎమ్మెల్సీ

ఇవీ చదవండి

అధికారి ఇంటిపై ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరు మృతి

రాణించిన బ్యూమంట్, స్కైవర్​​.. ఇంగ్లాండ్ ఘనవిజయం

Last Updated : Jun 28, 2021, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.