ETV Bharat / city

నిండా ముంచిన 'నివర్'...ఆదుకోవాలంటూ బాధితుల వేడుకోలు - లేటెస్ట

నివర్ తుపాను రైతులను నిండాముంచింది. ఎడతెరిపిలేని వర్షాలతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. అప్పుచేసి వ్యవసాయం చేస్తే...చివరకు తిప్పలే మిగిలాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ధీనంగా వేడుకొంటున్నారు.

అన్నదాతలను నిండా ముంచిన 'నివర్
అన్నదాతలను నిండా ముంచిన 'నివర్
author img

By

Published : Nov 28, 2020, 7:03 PM IST

ప్రకాశం

నివర్ తుపాను ధాటికి దర్శి నియోజకవర్గంలోని పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు పొగాకు తోటలు నీట మునిగాయి. ఆరుగాలం కష్టపడి పండించి తాళ్ళతో గుచ్చిన పొగాకు దండేలు నేలకరిచాయి. అప్పుచేసి వ్యవసాయం చేస్తే...తీరని తిప్పలే మిలిలాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

అన్నదాతలను నిండా ముంచిన 'నివర్'.

తూర్పుగోదావరి

అధిక వర్షాల వల్ల అన్నదాత ఆశలు ఆవిరైపోయాయి. కోనసీమ ప్రాంతంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వేలాది ఎకరాల వరి పంటలు ముంపునకు గురయ్యాయి. ధాన్యం రాశులు కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యం ఆరబెట్టేందుకు ఖర్చు అధికమవుంతుందని...ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

అన్నదాతలను నిండా ముంచిన 'నివర్'.

కృష్ణా

నివర్ తుపాను దాటికి తీర ప్రాంతాలు తల్లడిల్లిపోతున్నాయి. గత రెండ్రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షం, ఈదురుగాలులతో పెదపట్నంలో పలుచోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. జిల్లాలో వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. కోతకొచ్చే సమయంలో వర్షాలు కురవటంతో రైతన్నల ఆశలు ఆవిరయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు సడలించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. నివర్ తుపాను వల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. చందర్లపాడు మండలంలోని పలు గ్రామాల్లో పంటనష్టపోయిన రైతులను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు పరామర్శించారు. నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను అంచనా వేసి త్వరితగతిన పరిహారం అందించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీ.ఆంజనేయులు డిమాండ్ చేశారు.

అన్నదాతలను నిండా ముంచిన 'నివర్'.

అనంతపురం

కోతకు సిద్ధంగా ఉన్న పంట నివర్ తుపాను కారణంగా నేలమట్టం కావటంతో రైతుల ఆవేదన వర్ణణాతీతంగా మారింది. రూ. 40 వేలు పెట్టుబడి పెట్టి పంటలు ఒకటిన్నర ఎకరాలు వరిసాగు చేస్తే...నీట మునిగి పూర్తిగా నష్టపోయాని కళ్యాణదుర్గం మండలం మూసి కొట్టాల తండాకు చెందిన రైతు మారుతీ నాయక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అర్థిస్తున్నాడు. హిందూపురం, ధర్మవరం పట్టు రీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె మూడవరోజు చేరుకుంది. కొవిడ్ కారణంగా పట్టు రీలర్లు తీవ్రంగా నష్టపోయారని రీలర్లకు ఇన్సెంటివ్ వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రీలర్లు కింద పనిచేసే కార్మికుల సంక్షేమానికై ఇంటి పట్టాల కోసం భూమిని కేటాయిస్తే... వైకాపా ప్రభుత్వం పట్టాల పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

అన్నదాతలను నిండా ముంచిన 'నివర్'.

పశ్చిమగోదావరి

నివర్ తుఫాను వల్ల కురిసిన వర్షాలకు దెందులూరు మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం రాశులు తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని పొలాల నుంచి బయటకు తీసుకురావడానికి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూలీలు దొరక్క అవస్థలు పడుతున్నారు. ఇదివరకు కురిసిన వర్షాల కారణంగా దిగుబడులు కోల్పోయామని..., ఇప్పడు నివర్ తుపాను వల్ల నష్టాల ఊబిలో కూరుకుపోయమని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్నదాతలను నిండా ముంచిన 'నివర్'.

కడప

రైల్వేకోడూరు నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉద్యాన పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అరటి, బొప్పాయి, మామిడి పంటలు ఈదురు గాలుల కారణంగా నెలకొరిగాయి. జిల్లా పరిధిలో 5,021 హెక్టార్లలో రైతులు పంట నష్టపోయారని అధికారులు తెలిపారు. నివర్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయామని.., తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్నలు వేడుకొంటున్నారు.

అన్నదాతలను నిండా ముంచిన 'నివర్'.

చిత్తూరు

నివర్ తుపాను జిల్లా రైతులను నట్టేట ముంచింది. పడమటి మండలాలలో అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి. జీవాల పెంపకమే జీవనోపాధిగా ఉన్న తంబళ్లపల్లె నియోజకవర్గంలో తుఫాను ప్రభావంతో 500 వరకు గొర్రెలు, మేకలు మృతి చెందాయి. తమకు జీవాల పెంపకమే ఆధారమని ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెలపెంపకం దారులు కోరుతున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో నివర్ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపింది. అప్పులు చేసి వ్యవసాయం చేస్తే..పంట చేతికందే సమయానికి తుపాను తుడిచిపెట్టుకుపోయిందని వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చినపోయిన మూగజీవాల వద్ద పెంపకందారులు
చినపోయిన మూగజీవాల వద్ద పెంపకందారులు

ఇదీచదవండి

'పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.