ETV Bharat / city

కష్టాలను ఎదుర్కోనే మనోధైర్యాన్ని నింపిన 2020 - విజయవాడలో నూతన సంవత్సర వేడుకలు

2020 సంవత్సరం మరికొద్ది సేపట్లో కాలం చక్రంలో కలిసిపోనుంది. 2020 ఎన్నో జ్ఞాపకాలు.. మరెన్నో అనుభవాలను మదిలో పదిలం చేసింది. ప్రతీ ఏడాదికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. 2020 చరిత్రలో మరిచిపోలేని సంవత్సరంగా నిలిచిపోబోతోంది. పల్లె నుంచి పట్నం వరకు.. పేద నుంచి ధనవంతుల వరకు జీవితాంతం గుర్తుండిపోనుంది. కనిపించని శత్రువుతో ప్రపంచమంతా పోరాడింది. ఎన్నో పాఠాలు నేర్పింది. మనిషి విలువను చెప్పింది. ఆపన్నుల కోసం అర్రులు చాచేలా చేసింది. కుటుంబ విలువను నేర్పింది. సాంప్రదాయ పద్ధతులే మేలని చాటింది. కొత్త సంవత్సరాన్ని ఆర్భాటంగా...అట్టహాసంగా... అంతకు మించి ఉత్సాహంగా ఆహ్వానించాలనుకునే వారి ఆశల్ని సైతం తన చివరి మజిలిలోను 2020 దూరం చేసింది. కరోనా భయం కావొచ్చు... ముందస్తు జాగ్రత్తలు పాటించడం మేలైన ఆలోచన అవొచ్చు... ఈసారి 2021 సంవత్సర ఆరంభానికి మార్కెట్‌లో సందడి నిరాశాజనకంగానే ఉంటోంది. ధరాభారం సగటు జీవిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ... నూతన సంవత్సరాన్ని ఎంతో భారంగానే ఆశావహ ధృక్పదంతో ఆహ్వానించేందుకు అంతా సిద్ధమవుతున్నారు.

new year celebrations
కష్టాలను ఎదుర్కోనే మనోధైర్యాన్ని నింపిన 2020
author img

By

Published : Dec 31, 2020, 6:13 PM IST

మరి కొన్ని గంటల్లోనే ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతోంది. కొత్త ఆశలు, సరికొత్త ఆశయాలతో నూతన ఏడాదిలోకి అడుగుపెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2020కి వీడ్కోలు చెప్పి.. ఉరిమే ఉత్సాహంతో 2021కి స్వాగతం పలికేందుకు అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కరోనా భయం విజయవాడ నగరంలో ఉత్సాహాన్ని తగ్గించేసింది. రాష్ట్రంలో ఇప్పటికీ నమోదవుతున్న కరోనా కొత్త కేసుల్లో కృష్ణా జిల్లాలోనే ఎక్కువగా ఉంటుండటం... విజయవాడ నగరంలో ఈ సంఖ్య మరింతగా నమోదవుతుండటాన్ని పరిగణనలోకి తీసుకున్న యంత్రాంగం కట్టుదిట్టమైన ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో కొత్త సంవత్సర వేడుకలపై చీకట్లు కమ్ముకుంటున్నాయి. పోలీసులు కూడా పార్టీలకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వం, వైద్యులు సామూహిక పార్టీలు వద్దని హెచ్చరిస్తున్నారు.

కష్టాలను ఎదుర్కోనే మనోధైర్యాన్ని నింపిన 2020

నిరాడంబరంగా వేడుకలు...

బహిరంగ ప్రదేశాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి కేక్‌ కటింగ్​లు నిషేధించిన కారణంగా ఇళ్లలోనే కుటుంబ సభ్యుల మధ్య వేడుకలు నిర్వహించుకొనున్నారు. బేకరీల్లో కేక్‌ల విక్రయాలు గతంతో పోలిస్తే తగ్గినప్పటికీ...కొంత మెరుగైన పరిస్థితి కనిపిస్తోందని వ్యాపారులు అంటున్నారు. మరో వైపు స్వీట్‌ దుకాణాల వద్ద ఆశించిన విక్రయాలు లేవు. విజయవాడలోని ప్రధాన మార్కెట్‌ కూడళ్లలో కొత్త సంవత్సరానికి మూడు రోజుల ముందు నుంచే ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటు చేసి స్వీట్లు, కేక్‌లు విక్రయించేవారు. కల్యాణ మండపాలను అద్దెకు తీసుకుని మరి కేక్‌లు, స్వీట్‌లను తయారు చేసి విక్రయించేవారు. ఇప్పుడు ఆ వాతావరణం కనిపించడం లేదు. రోడ్లపై అక్కడక్కడ షామియానాలు వేసి బేకరీ పదార్ధాలు, మిఠాయిల విక్రయిస్తుండగా పోలీసులు వాటిని తీయించేస్తున్నారు.

తగ్గిన పువ్వుల సాగు...

కొత్త సంవత్సర ప్రారంభ సమయం నుంచి ఆత్మీయులకు పుష్పగుచ్ఛాలు, పండ్లు, మిఠాయి బాక్సులు అందించి వారి ఆశీస్సులు పొందే సంస్కృతి చాలా కాలం నుంచి ఉంది. ఈసారి వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో పువ్వుల సాగు లేక రైతుల మోములో నవ్వు లేదు. పూల తోటల్లో సరైన దిగుబడి లేకపోవడంతో వీటి ధరలు పెరిగాయి. పూల బొకేలకు గిరికీ ఉంటున్నా... వాటి ధరలు ఎక్కువగా ఉండడంతో కొనుగోళ్ల సంఖ్య తగ్గుతోందని తయారీదారులు చెబుతున్నారు.

వేడుకలకు దూరంగా...

పార్టీలు, ఈవెంట్స్ అంటూ హోటళ్లలో వేలకు వేల రూపాయలు కుమ్మరించేందుకు ఈసారి పోలీసుల అనుమతులు లేవు. మ్యూజికల్​ షో, పార్టీలు, ఈ వెంట్స్‌పై ఆంక్షలు ఉండడంతో సందడి తగ్గింది. ఆన్​లైన్ లో ​కావాల్సిన ఆహార పదార్ధాలను ఆర్డరు ఇచ్చి తెప్పించుకుని.... ఇంటి నుంచి కాలు బయటపెట్టకుండా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలనే ఆలోచన అనేక మందిలో వ్యక్తమవుతోంది. 2020 వంటి ఘోరమైన సంవత్సరం ఇంకొకటి లేనేలేదని... ఈ ఏడాది ఎన్నో సంక్షోభాలను నింపినా, కష్టాలను ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యాన్ని నేర్పింది. అనంత కాలచక్రంలో సంవత్సర కాలమనేది చాలా చాలా చిన్నది. జీవ పరిణామక్రమం, మానవ మేధ మనిషిని పురోగతి వైపే నడిపించింది, నడిపిస్తుంది కూడా. ఆశాజీవి, కష్టజీవి అయిన మనిషికి రేపు అనేది ఎప్పుడూ ఉషోదయమే, నవోదయమే. 2021ని ఇదే ఆశతో... ఆకాంక్షతో ఆహ్వానించబోతున్నారు.

ఇదీ చదవండీ...సరికొత్త లక్ష్యాలతో 2021కి ఆహ్వానం పలుకుతున్న యువత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.