NTR Trust: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పాల్గొని కేక్ కట్ చేశారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని భువనేశ్వరి ఆకాంక్షించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలను ఆమె సమీక్షించారు. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలలో ఇటీవల వరద బీభత్సంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు సేవలందించిన ట్రస్ట్ సిబ్బందిని, ప్రతినిధులను అభినందించారు.
ఎన్డీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చేపట్టిన సేవా కార్యక్రమాలకు అండగా నిలిచిన దాతలకు భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్ సేవా కార్యక్రమాలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో కె. రాజేంద్రకుమార్, డైరెక్టర్ ఎన్.ఎస్. ప్రసాద్, అకాడమిక్ డీన్ ఎం.వీ.రామారావు, ట్రస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :
CBN comments on early elections: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం.. ఎప్పుడైనా రెడీ : చంద్రబాబు