ETV Bharat / city

Krishna River: సోమశిల వద్ద.. కృష్ణా నదిపై కొత్త వంతెనకు ప్రణాళికలు సిద్ధం!

కృష్ణా నదిపై సోమశిల వద్ద అధునాతన వంతెన నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ మీదుగా ఏపీలోని నంద్యాల వరకు జాతీయ రహదారి అనుసంధానానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ అనుమతించింది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే వారికి సుమారు 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అంచనా.

somasilaసోమశిల వద్ద... కృష్ణా నదిపై కొత్త వంతెనకు ప్రణాళికలు సిద్ధం..!
somasila
author img

By

Published : Jun 9, 2021, 9:51 AM IST

తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ మధ్య మరో వారధికి మార్గం సుగమమవుతోంది. కృష్ణానదిపై సోమశిల వద్ద అధునాతన వంతెన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల వరకు జాతీయ రహదారి అనుసంధానానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ అనుమతించింది. మొత్తం 165 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి 85 కిలోమీటర్లు తెలంగాణలో, 80 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే వారికి సుమారు 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అంచనా. ఈ ప్రాజెక్టులో భాగంగా సోమశిల వద్ద భారీ వంతెన నిర్మించనున్నారు.

తెలంగాణలో 85 కిలోమీటర్ల రహదారితో పాటు వంతెన నిర్మాణానికి సుమారు రూ.1,200 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు. ఇందులో రూ.600 కోట్లు వంతెనకే కేటాయించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. దీన్ని అధునాతనంగా నిర్మించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యూహంగా ఉంది. రెండు నుంచి మూడు కిలోమీటర్ల పొడవుండే ఈ వంతెనను హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్ద నిర్మించిన హ్యాంగింగ్‌ బ్రిడ్జ్‌ తరహాలో నిర్మించాలా? లేదా సస్పెన్షన్‌ తరహాలో నిర్మించాలా? అన్న విషయంపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. కన్సల్టెంట్‌ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉన్నతాధికారి తెలిపారు. మూడు నుంచి నాలుగు నెలల్లో ప్రాథమిక నివేదిక వస్తుందని, తర్వాత ప్రతిపాదనలను కేంద్రానికి పంపుతామని తెలిపారు.

ఇదీ చూడండి:

YS VIVEKA MURDER: వైఎస్ వివేకా హత్య కేసులో ముమ్మరంగా నాలుగో దఫా విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.