ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్, యాంటిజెన్ పరీక్షలో సీఎం కేసీఆర్‌కు నెగెటివ్ నిర్ధరణ అయింది. ఏప్రిల్ 19న కరోనా బారినపడిన సీఎం కేసీఆర్... ఇవాళ పూర్తిగా కోలుకున్నారు. ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
ఏప్రిల్ 14న సీఎం కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఆయన ఎర్రవల్లిలో వైద్య బృందం పర్యవేక్షణలో ఐసొలేషన్‌లో ఉన్నారు. 19న సీఎం కేసీఆర్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: అఫ్గానిస్థాన్‌లో వరదలు.. 37 మంది మృతి