జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు డా.ఆర్ జీ.ఆనంద్.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన పర్యటనలో భాగంగా డీజీపీని కలిసినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం డీజిపీతో కలసి అన్ని జిల్లాల ఎస్పీలు, సీడబ్ల్యూసీ ఛైర్మన్లు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర పోలీస్‌శాఖ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు విశేష కృషి చేస్తుందని ఆనంద్ తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్‌తో పాటు పోలీస్ శాఖను అయన అభినందించారు. ఆపరేషన్ ముస్కాన్ నిరంతర ప్రక్రియతో బాలబాలికలకు విముక్తి కల్పించటం, పునరవాసం కల్పించటంలో ఏపీ పోలీసు శాఖ ముందుందని వెల్లడించారు. దిశ చట్టం మహిళలకు ఏవిధంగా ఉపయోగపడుతుంతో డీజీపీ స్పష్టంగా వివరించారన్నారు. టెక్నాలజీ వినియోగంతో ఏపీ పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్నారని వెల్లడించారు.
ఇదీచదవండి