ETV Bharat / city

Lokesh: 'నిరుద్యోగుల పోరాటానికి ముందుంటా'

వైకాపా రెండేళ్ల పాలనలో.. 300 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యకు పాల్పడ్డారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. నిరుద్యోగుల పోరాటానికి ముందుంటానని.. ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చేవ‌ర‌కూ ప్ర‌భుత్వంపై క‌లిసిక‌ట్టుగా పోరాడదామని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. ఉద్యోగం రాక క‌ర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన నాగేంద్రప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన సంతాపం ప్రకటించారు.

nara lokesh request unemployees to not make suicide attempts
'నిరుద్యోగుల పోరాటానికి ముందుంటా'
author img

By

Published : Jul 5, 2021, 3:39 PM IST

  • నిరుద్యోగులారా నిరుత్సాహం వ‌ద్దు..క‌లిసి పోరాడ‌దాం.ఆత్మ‌హ‌త్య‌లు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కానే కాదు.(3/3)#YCPJoblessCalendar #JaganCheatedAPYouth

    — Lokesh Nara (@naralokesh) July 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • .@ysjagan ముఖ్య‌మంత్రి ప‌దవి చేప‌ట్టి రెండేళ్ల‌యినా, ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీ 2 ల‌క్ష‌ల 30 వేల ఉద్యోగాల భ‌ర్తీకి ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే రోజుకొక నిరుద్యోగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం వార్త వినాల్సి వస్తోంది.(1/3)#YCPJoblessCalendar #JaganCheatedAPYouth pic.twitter.com/2u0cdHbgv5

ఏటా డీఏస్సీ నోటిఫికేషన్, కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల డిమాండ్‌పై నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి ముందుంటానని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చేవ‌ర‌కూ.. ప్రభుత్వంపై క‌లిసిక‌ట్టుగా పోరాడదామని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. వైకాపా రెండేళ్ల పాలనలో.. 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు.

కర్నూలు జిల్లా ప్యాపిలి మండ‌లం గోపాల‌న‌గ‌రానికి చెందిన నాగేంద్రప్రసాద్.. బీఈడీ పూర్తి చేసి ఉద్యోగం రాక ఆత్మహ‌త్యకు పాల్పడటంపై విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించారు. ప్రభుత్వం నిరంకుశ ధోర‌ణితో ఇంకా ఎంతమందిని బ‌లి తీసుకుంటుందని.. లోకేశ్ ప్రశ్నించారు. త‌ల్లిదండ్రుల ఆశ‌లు వ‌మ్ము చేసిలా నిరుద్యోగులు ఆత్మహత్యలు మానుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు.

ఇదీ చదవండి:

Curfew Relaxation: 50 శాతంతో వాటికి అనుమతి..అవి ఏంటంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.