పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. పేదల స్థలాలు లాక్కొని తిరిగి వారికే అమ్మకం పెడుతున్నారని ట్విటర్ వేదికగా విమర్శించారు. దళితుల భూములు లాక్కొని వారికి జీవనోపాధి లేకుండా చేసి.. ఇప్పుడు గిరిజనుల భూములపై పడ్డారని మండిపడ్డారు.
కడప జిల్లా పోలోపల్లి ఎస్టీ కాలనీకి చెందిన గిరిజనుల భూమిని జగన్ ప్రభుత్వం దౌర్జన్యంగా స్వాధీనపరుచుకుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదల ఉపాధికి ఊతం ఇవ్వాల్సింది పోయి.. 15 ఏళ్ల నుంచి భూమిని సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న గిరిపుత్రుల పొట్టపై కొట్టే అహంకారం ఎక్కడి నుండి వచ్చిందని ఆక్షేపించారు. ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.