సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై పోలీసులు ఇబ్బందిపెట్టినా, వైకాపా చిల్లర గ్యాంగులు బెదిరించినా itdpblog.com వెబ్‌సైట్‌లోని వాట్సాప్ లింకు ద్వారా సమాచారమివ్వాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచించారు. న్యాయ సహాయంతో పాటు అన్నివిధాలా తెదేపా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలకు రక్షణగా ఐటీడీపీబ్లాగ్‌ను ప్రారంభించడం తెదేపా కుటుంబానికి అండగా ఉండేందుకు వేసిన మరో ముందడుగని పేర్కొన్నారు. ప్రశ్నిస్తే కేసు.. పోరాడితే అరెస్టు చేయడమేంటని.. ఇంకెన్నాళ్లీ అరాచక పాలన అని బుధవారం ట్విటర్‌లో ధ్వజమెత్తారు. ‘తుగ్లక్ పాలనలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టి ప్రజలకు తోడుగా ఉంటున్న ఐటీడీపీ సభ్యులకు అండగా నిలుస్తాం. సామాజిక మాధ్యమంవేదికగా వైకాపా నేతలు చేస్తున్న అరాచకాలను బయటపెట్టడంతో పాటు.. ప్రజల కష్టాలను వెలుగులోకి తేవడంలో కీలకపాత్ర పోషిస్తున్న విజయ్ చింతకాయల, ఇతర సభ్యులకు అభినందనలు’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
krishna water disputes: కృష్ణా నదీ జలాల వివాదం.. ఏపీ పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ