చంద్రబాబు హయాంలో, పేదలకు 5 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చారని... దాదాపుగా 12 లక్షల మంది పేదలకు, అన్ని సౌకర్యాలతో ఇళ్లు కట్టించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ గుర్తు చేశారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియ జరిగిందన్న లోకేశ్.... ఇప్పుడు 25 లక్షల ఇళ్ల పట్టాలు అంటూ ఎస్సీలు, పేదల భూములు కొల్లగొడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల్ని మోసం చేసే బిల్డప్ స్కీమ్స్ ఎందుకని ముఖ్యమంత్రిని నిలదీశారు. రాజధానిలో కట్టించిన ఇళ్లకు సంబంధించిన ఫొటోలను తన ట్విటర్లో లోకేశ్ పోస్ట్ చేశారు.
మోసం రెడ్డి.. కొత్త స్కీం మెుదలుపెట్టారు: లోకేశ్ - ఇళ్ల పథకంపై నారా లోకేశ్ వ్యాఖ్యలు న్యూస్
శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకునే జీవితాల్లో మార్పు ఎలా వస్తుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన ఇళ్లకు వైకాపా రంగులు వేసే కొత్త స్కీం మొదలుపెట్టి సీఎం జగన్ మోసం రెడ్డి అయ్యారంటూ ట్వీట్ చేశారు.