-
కోర్టు ఆదేశాలను పాటించకుండా రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని తెల్లారేసరికి పేదల నీడని కూలగొట్టేశారు. కోర్టు సెలవులు చూసుకుని మరీ విధ్వంసానికి తెగబడ్డారు. బాధితులకు న్యాయం జరిగేవరకూ టిడిపి అండగా వుంటుంది.(2/2)
— Lokesh Nara (@naralokesh) April 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">కోర్టు ఆదేశాలను పాటించకుండా రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని తెల్లారేసరికి పేదల నీడని కూలగొట్టేశారు. కోర్టు సెలవులు చూసుకుని మరీ విధ్వంసానికి తెగబడ్డారు. బాధితులకు న్యాయం జరిగేవరకూ టిడిపి అండగా వుంటుంది.(2/2)
— Lokesh Nara (@naralokesh) April 18, 2021కోర్టు ఆదేశాలను పాటించకుండా రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని తెల్లారేసరికి పేదల నీడని కూలగొట్టేశారు. కోర్టు సెలవులు చూసుకుని మరీ విధ్వంసానికి తెగబడ్డారు. బాధితులకు న్యాయం జరిగేవరకూ టిడిపి అండగా వుంటుంది.(2/2)
— Lokesh Nara (@naralokesh) April 18, 2021
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో నిరుపేదలకు చెందిన 120 ఇళ్ల కూల్చివేత దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్పిట్టర్లో మండిపడ్డారు. బాధితులకు అండగా నిలవాలని నియోజకవర్గ నేతలకు సూచించారు. సీఎం జగన్ పాలనలో జే ట్యాక్స్ వసూలు కాకపోతే.. జేసీబీలతో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఒక ఇల్లు సైతం కట్టలేని ప్రభుత్వానికి.. నిరుపేదల గృహాలు కూలగొట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. బాధితులకు తెదేపా అండగా ఉండి న్యాయపోరాటం సాగిస్తుండగా.. ఇలా ఇళ్లు కూల్చివేయడం అరాచక పాలనకి నిదర్శనమన్నారు.
ఇదీ చదవండి: ఘోర ప్రమాదం: కారు లోయలో పడి ఐదుగురు మృతి
వివాదం కోర్టులో ఉండగా.. 40 ఏళ్ల నుంచి రేకుల షెడ్డులు వేసుకుని జీవిస్తున్న 120 నిరుపేద కుటుంబాలను నడిరోడ్డున పడేయడం న్యాయమేనా అని లోకేశ్ నిలదీశారు. బాధితులతో వారం రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలనే కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి.. రాత్రికి రాత్రే కూల్చివేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బాధితుల న్యాయవాదికి వాట్సప్‌లో సమాచారం పంపి ఎవరి.. ఆదేశాలతో గృహాలను కూల్చివేశారో తహసీల్దార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం కోర్టుకి సెలవు అని చూసుకుని.. న్యాయస్థానానికి వెళ్లే అవకాశం లేకుండా చేసి ఇళ్లు కూలగొట్టడం ముమ్మాటికీ కుట్రపూరితంగా, ఎమ్మెల్యే ఆదేశాలతో జరిగిందేనని ఆరోపించారు. రోడ్డు విస్తరణ పేరిట.. ఎమ్మెల్యే సామాజికవర్గానికి ప్రయోజనం చేకూర్చడం కోసమే నిరుపేదల గూడు కూలగొట్టారని అనుమానం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: