ETV Bharat / city

సమీకృత విధానాలతోనే ఆదాయం: నాబార్డు ఛైర్మన్ - నాబార్డ్ ఛైర్మన్ న్యూస్

రైతులు సంఘటితమై సమీకృత విధానాలు అనుసరిస్తే ఆదాయం పెరుగుతుందని నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు స్పష్టం చేశారు. దేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చేందుకు సాగు పద్ధతులు మార్చుకొని కొత్త ధృక్పథంతో ముందుకు సాగాలన్నారు.

రైతులు సాగు పద్ధతులు మార్చుకొని కొత్త విధానాలు అనుసరించాలి

author img

By

Published : Mar 18, 2021, 5:27 PM IST

దేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చేందుకు రైతులు తమ సాగు పద్ధతులు మార్చుకొని కొత్త ధృక్పథంతో ముందుకు సాగాలని నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు సూచించారు. విజయవాడలో నిర్వహించిన రైతు ఉత్పత్తిదారుల కంపెనీ డైరెక్టర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. రైతులు సంఘటితమై సమీకృత విధానాలు అనుసరిస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. చాలా దేశాలు ఈ తరహా విధానాలను అనుసరించి సత్ఫలితాలు సాధించాయని గుర్తు చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో సాగు విస్తీర్ణం పెరగపోయినా..,జనాభా గణనీయంగా వృద్ధి చెందిందన్నారు. కరోనా సమయంలో అన్ని రంగాలు కుదేలైనా..వ్యవసాయం రంగం పూర్తి స్థాయిలో పని చేసిందన్నారు.

రైతులు తమ పంట అవసరాలు తీర్చుకునేందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి వడ్డీకి రుణాలు తీసుకోకుండా బ్యాంకుల నుంచి పరపతి పొందాలని ఆయన సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు నాబార్డు పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన అవసరత ఎంతో ఉందని..,వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు సాగుదారులు ఈ పద్ధతులను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

రైతు సంఘాలకు ఖాదీ గ్రామీణ కమిషన్‌ ఆర్థిక సహాయం అందిస్తుందని ఆ కమిషన్‌ దక్షిణ భారత ఛైర్మన్‌ శేఖరరావు తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ పది ఎకరాల విస్తీర్ణంలో ఆహారశుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ సీఈఓ శ్రీధరరెడ్డి వివరించారు. నాబార్డు, అమరావతి ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, వారాహి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల లిమిటెడ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇదీచదవండి

సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ.. హై కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.