పాఠశాలల విలీనంలో భాగంగా మున్సిపల్ టీచర్లను పాఠశాల విద్యాశాఖ ఆధీనంలోకి తీసుకురావొద్దని డిమాండ్ చేస్తూ.. పురపాలక, విద్యాశాఖలకు మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు 17 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రొగ్రెసివ్ మున్సిపల్ టీచర్ల అసోసియేషన్ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్‌కు అందజేశారు. మున్సిపల్ చట్టం ప్రకారం విద్యాశాఖాధికారి సూపర్వైజర్ పోస్టుల ద్వారా మాత్రమే పురపాలక పాఠశాలల్లో పర్యవేక్షణ చేసేలా ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశాయి. మున్సిపల్ టీచర్లకు సాధారణ బదిలీలు, జీపీఎఫ్ ఖాతాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. పీఎంటీఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు విజ్ఞాపన పత్రం ఇచ్చారు.
ఇవీ చూడండి