పుర, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికల్లో 90,61,806 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2019 జనవరి 1 అర్హత తేదీగా 2020 మార్చి 9న ప్రచురించిన ఓటర్ల జాబితాను వినియోగించాలన్న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పురపాలకశాఖ వీటిని సిద్ధం చేసింది. ఎన్నికలు నిర్వహించే 75 పురపాలక, నగర పంచాయతీల, 12 నగరపాలక సంస్థలవారీగా ఓటర్ల జాబితాలను ఆ శాఖ వెబ్‌సైట్‌లోనూ అప్‌లోడ్ చేస్తున్నారు.
- ఎన్నికలు నిర్వహిస్తున్న వాటిలో అత్యధికంగా పది పురపాలక సంఘాలున్న జిల్లా: తూర్పుగోదావరి
- అత్యల్పంగా కేవలం రెండు పురపాలక సంఘాలున్న జిల్లా (జీవీఎంసీ మినహా): విశాఖపట్నం
ఇదీ చదవండి: అతివిశ్వాసం వద్దు.. మున్సిపల్ ఎన్నికల్లో మరింత కష్టపడాలి: సీఎం జగన్