ETV Bharat / city

Mulugu Siddanthi: ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి హఠాన్మరణం - Mulugu Siddanthi heart attack news

Mulugu Siddanthi: ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. జ్యోతిషులుగా 30 ఏళ్లకు పైగా ములుగు సిద్ధాంతి సేవలందించారు. సోమవారం సాయంత్రం 5:30 గంటలకు మలక్‌పేట్ రేసు కోర్సు సమీపంలోని హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Mulugu Ramalingeswara Siddhanti demise
ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి హఠాన్మరణం
author img

By

Published : Jan 23, 2022, 10:13 PM IST

Updated : Jan 24, 2022, 12:08 PM IST

Mulugu Siddanthi: ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి హఠాన్మరణం చెందారు. ఒక్కసారిగా వచ్చిన గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయాసంతో ఉన్న ములుగు సిద్ధాంతిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ములుగు సిద్ధాంతి ఆకస్మిక మరణం పట్ల జ్యోతిషవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

30 ఏళ్లుగా విశేష సేవలు..

ములుగు సిద్ధాంతిగా పేరొందిన రామలింగేశ్వర సిద్ధాంతి 30 ఏళ్లుగా జ్యోతిషులుగా విశేష సేవలందించారు. రాశిఫలాలతో పాటు, ఆయన చెప్పే జ్యోతిషాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం విశ్వసిస్తుంటారు. ఎన్నికలు, ప్రకృతి విపత్తులు.. ఇలా పలు అంశాలపై ఆయన ఎప్పటికప్పుడు తన అంచనాలను వెలువరించేవారు. ఆయన మృతిపట్ల జ్యోతిషవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ములుగు సిద్ధాంతి గారి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం 5:30 గంటలకు మలక్‌పేట్ రేసుకోర్సు సమీపంలోని హిందూ స్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష పండితుడిగా...

శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష పండితుడిగా, శ్రీశైలం పీఠాధిపతిగా ములుగు సిద్ధాంతి సేవలందించారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా జ్యోతిషంలో సేవలందించిన ఆయన గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించడానికి ముందు ఆయన ఎంఆర్‌ ప్రసాద్‌ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపు పొందారు. సినీ నటులు ఏవీఎస్‌, బ్రహ్మానందం తదితర కళాకారులతో ప్రదర్శనలు ఇచ్చారు.

శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి పూజా హోమాది క్రతువుల్లో శిక్షణపొందిన బ్రాహ్మణులతో ప్రతీ మాసశివరాత్రికి పాశుపతహోమాలు నిర్వహించేవారు. ప్రతి ఏడాది ములుగు సిద్ధాంతి అందించే పంచాంగ ఫలితాలను యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా కోట్లాది మంది వీక్షించేవారు. కరోనా నేపథ్యంలో లోక కల్యాణం కోసం ములుగు సిద్ధాంతి ఇటీవల యాదాద్రి, శ్రీశైలం, శ్రీకాళహస్తి తదితర పుణ్యక్షేత్రాల్లో ఆయుష్య హోమాలు నిర్వహించినట్లు ఆయన కుమారుడు సోమేష్‌కుమార్‌ తెలిపారు.

చంద్రబాబు సంతాపం..

ములుగు రామ‌లింగేశ్వ‌ర సిద్దాంతి మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్ర‌ముఖ పంచాగక‌ర్త‌గా ఆయన అంద‌రికీ సుప‌రిచితమని గుర్తు చేసుకున్నారు. ఆయ‌న మృతికి సంతాపం తెలుపుతూ..కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఇదీ చదవండి:Online tickets in srisailam temple: ఆన్​లైన్​లో.. శ్రీశైలం దర్శన టికెట్లు

Last Updated : Jan 24, 2022, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.