ప్రధాని మోదీ నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో జగన్ వ్యాఖ్యలు బాధాకరమని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. కరోనా పట్ల ఏ మాత్రం ఆందోళన లేకుండా.. లాక్‌డౌన్ కొన్ని జోన్లకే పరిమితం చేయాలని అనడం బాధ్యతారాహిత్యమేనన్నారు. రమేష్ కుమార్‌ను తొలగించి తన నియంతృత్వ ధోరణిని జగన్ బయటపెట్టారని ఎంపీ అన్నారు. హెల్త్ ఎమర్జెన్సీలో కూడా రాజకీయాలకే ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎవరూ ప్రవర్తించని విధంగా వైద్యులను జగన్ సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ప్రాథమిక కార్యాచరణ లేకుండా ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టనట్లు ప్రవర్తిస్తున్నారని రామ్మోహన్‌నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..