MP Rammohan Naidu On bifurcation act: విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని కోరారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చలో మాట్లాడిన రామ్మోహన్‌నాయుడు.. దేశ అవసరాల రీత్యా బిల్లును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో బిల్లులో పొందుపరిచిన అదనపు వర్శిటీలతో పాటు ప్రాంతీయ కేంద్రాలను.. ఏపీలోని విశాఖలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనితో పాటు గతంలోనే భూములిచ్చినా ఇప్పటికీ కేంద్ర సంస్థల నిర్మాణాలు నెమ్మదిగా సాగుతున్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు.
ఇవీ చూడండి