రాష్ట్రంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను నిలువరించాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వైకాపా ఎంపీ రఘురామకృష్ణం రాజు లేఖ రాశారు. ఎవరి మాట వినకుండా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి అధికంగా ఉంటే.. పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం ఒక్కరికే సమాజం పట్ల బాధ్యత ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పరీక్షల సమయంలో.. కరోనా పరీక్షలు చేస్తామని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు పరీక్షలు పెడితే తరువాత దానికి 'జగనన్న శ్మశాన దీవెన' పథకంగా పేరు పెట్టాల్సివస్తుందని రఘురామ ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి:
కొవిడ్ పోరులో 24x7 సహాయ చర్యలు: ఐఏఎఫ్
విద్యార్థుల ప్రాణాలు పోతే సీఎం తిరిగి తెచ్చిస్తారా..? : జవహర్