ETV Bharat / city

RRR: బెయిల్ బ్యాచ్ అంతా కలిసి నీతులు వల్లిస్తున్నారు: రఘురామ - సీఐడీ డీజీపై రఘురామ కామెంట్స్

బెయిల్‌ బ్యాచ్ అంతా కలిసి నీతులు వల్లిస్తున్నట్లు ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌పై గృహహింస చట్టం కింద ఆయన భార్య కేసు వేసిందన్నారు. ఈ కేసులో ఛార్జిషీట్‌ కూడా నమోదు చేశారన్నారు.

mp raghurama fire on cid dg sunil kumar
బెయిల్ బ్యాచ్ అంతా కలిసి నీతులు వల్లిస్తున్నారు
author img

By

Published : Jul 27, 2021, 3:20 PM IST

Updated : Jul 27, 2021, 4:04 PM IST

బెయిల్ బ్యాచ్ అంతా కలిసి నీతులు వల్లిస్తున్నారు

బెయిల్‌ బ్యాచ్ అంతా కలిసి నీతులు వల్లిస్తున్నట్లు ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. గృహహింస చట్టం కింద నిందితుడిగా తేలిన సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌...మరో ఇద్దరు నిందితులతో కలిసి తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ బాగోతంపై సరైన సమయంలో సమగ్ర వివరాలతో 420 చట్టం కింద ఫిర్యాదు చేస్తానన్న రఘురామ...సీబీఐ విచారణలో అన్నీ బయటకొస్తాయన్నారు.

తనపై వారు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రఘురామ అన్నారు. సునీల్ కుమార్‌పై ఆయన భార్య గృహహింస కేసు వేసిందని చెప్పారు. అతనిపై గృహహింస కేసులో ఛార్జ్‌షీట్‌ నమోదైందని వెల్లడించారు.

ఇదీ చదవండి

Mansas Trust: చైర్మన్ ఆదేశాలు పాటించాల్సిందే: మాన్సాస్ ట్రస్టు ఈవోకు హైకోర్టు ఆదేశం

Last Updated : Jul 27, 2021, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.