ETV Bharat / city

ఆశ్చర్యం.. అలా ఎలా జరిగిందో అర్థంకావట్లేదు: ఎంపీ రఘురామ - రఘురామ తాజా వార్తలు

ప్రధాని భీమవరం పర్యటన ప్రొటోకాల్ లిస్టులో తన పేరు లేదని తెలిసి ఆశ్చర్యపోయానని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తనను అడ్డుకుంటారని తెలిసే ప్రొటోకాల్‌ వంటి అంశాలపై ముందే లేఖ రాశానని అయినా.. తన పేరును లిస్టులో అధికారులు ఎందుకు చేర్చలేదో అర్థంకావట్లేదని అసహనం వ్యక్తం చేశారు.

ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయా.. అలా ఎందుకు జరిగిందో అర్థంకావట్లేదు

author img

By

Published : Jul 4, 2022, 3:18 PM IST

Updated : Jul 5, 2022, 6:57 AM IST

ప్రధాని భీమవరం సభకు తనను రానీయకుండా అడ్డుకున్నారని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలానే ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకుంటారని తెలిసే ప్రొటోకాల్‌ వంటి అంశాలపై ముందే లేఖ రాశానని అయినా.. తన పేరును లిస్టులో అధికారులు ఎందుకు చేర్చలేదో అర్థంకావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు ఆదేశాలిచ్చినా పట్టించుకోకపోతే ఏమనాలని ప్రశ్నించారు.

ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయా.. అలా ఎందుకు జరిగిందో అర్థంకావట్లేదు

"ప్రధాని సభకు రాకుండా నన్ను అడ్డుకున్నారు. విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలానే ఉంటాయి. పర్యటన లిస్టులో నా పేరు లేదని తెలిసి ఆశ్చర్యపోయా. ఇవన్నీ తెలిసే ప్రొటోకాల్‌ వంటి అంశాలపై ముందే లేఖ రాశా. నా పేరును లిస్టులో అధికారులు ఎందుకు చేర్చలేదో అర్థంకావట్లేదు. కోర్టులు ఆదేశాలిచ్చినా పట్టించుకోకపోతే ఏమనాలి ?." - రఘురామ కృష్ణరాజు, వైకాపా ఎంపీ

ఈ ముఖ్యమంత్రి ఉండగా.. రాష్ట్రంలో అడుగుపెట్టలేనేమో?

ఈ ముఖ్యమంత్రి ఉండగా తాను ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టలేనేమోనని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఎన్నికల నియామవళి అమల్లోకి వచ్చి పోలీసులు ముఖ్యమంత్రి అదుపు ఆజ్ఞల్లో లేనప్పుడే తాను రాష్ట్రంలో అడుగు పెట్టగలనని భావిస్తున్నట్లు చెప్పారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనను అభిమానించి, ప్రేమించే ఎంతో మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేయడంతో వారి క్షేమం కోసమే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వెళ్లలేకపోయానని తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులను కారులో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకువెళ్లినట్టు వారి తండ్రి తనకు ఫోన్‌ చేసి వాపోయారని చెప్పారు. తన కారణంగా చిత్రహింసలకు గురైన వారంతా క్షమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఒక ఎంపీ బతికే పరిస్థితుల్లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎంపీలు అంటే చట్టాలు చేసే వారిని ప్రజలు అనుకుంటారు. కానీ చట్టాలు చేసే ఒక ఎంపీకే సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొనడం దురదృష్టకరం. నా నియోజకవర్గంలోని కార్యక్రమంలో పాల్గొనకపోతే నాకు అహంకారం ఉందని ప్రధానమంత్రి ఎక్కడ భావిస్తారోననే ఆందోళన ఉండేది. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆహ్వానితుల జాబితాలోనే నా పేరు లేకపోవడంతో ఆ బాధ తొలగిపోయింది. పార్లమెంటరీ లా జస్టిస్‌, పబ్లిక్‌ గ్రీవెన్స్‌ కమిటీ సభ్యుడినైన నాకు జరిగిన అన్యాయం దేశంలో మరెవరికీ జరగలేదు...’ అని పేర్కొన్నారు. తన ఇంటి వద్ద ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌గా చెప్పుకొనే ఒక వ్యక్తిని సోమవారం భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. తన ఇంటి వద్ద ఇంటెలిజెన్స్‌ పోలీసులను నియమించాల్సిన అవసరం ఏమిటి అని ప్రశ్నించారు. ఈ విషయమై తాను కోర్టును ఆశ్రయించనున్నానని రఘురామ వెల్లడించారు.

ఇవీ చూడండి :

Last Updated : Jul 5, 2022, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.