ETV Bharat / city

'తప్పుడు కేసులతో అమరావతి ఉద్యమాన్ని అణచలేరు' - ap capital row news

పార్లమెంట్​లో రాష్ట్ర సమస్యలు ప్రస్తావిస్తోన్న తెదేపా ఎంపీలకు.. వైకాపా ఎంపీలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉన్నంత మాత్రాన ప్రతీదానికి అడ్డు తగలడం సబబు కాదని చెప్పారు. గతంలో 20 మంది ఎంపీలున్న తెదేపా.. సభా మర్యాదలు పాటించలేదని గుర్తు చేశారు.

ఎంపీ కేశినేని నాని
ఎంపీ కేశినేని నాని
author img

By

Published : Feb 8, 2020, 7:27 PM IST

పార్లమెంట్​లో వైకాపా సభ్యులు తమతో అనుచితంగా వ్యవహరిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పెట్టిన కేసులో అరెస్టైన తెదేపా కార్యకర్తలను... ఆయన నందిగామ సబ్​జైల్​లో పరామర్శించారు. లోక్​సభలో రాష్ట్రం గురించి తెదేపా సభ్యులు మాట్లాడుతుంటే వైకాపా ఎంపీలు అడ్డుకుంటున్నారని, అది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. గతంలో తెదేపా తరఫున 20 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ఎప్పుడూ అలా వ్యవహరించలేదని గుర్తు చేశారు. పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాయడం మంచి పద్ధతి కాదన్నారు. అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని మహిళలపై సైతం కేసులు పెట్టడం సబబు కాదన్నారు కేశినేని నాని. తప్పుడు కేసులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరని చెప్పారు.

ఇదీ చదవండి:

కరోనా వైరస్ కన్నా వైకాపా చాలా ప్రమాదకరం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.