ETV Bharat / city

'సీఏఏ, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా వైకాపా బిల్లు పెట్టాలి' - MP Kesineni Nani comments on BJP

కేరళలో చేసినట్టుగా వైకాపా ప్రభుత్వం కూడా సీఏఏ, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా బిల్లు పెట్టాలని ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. ఆ బిల్లుకు తెదేపా తరపున తాము మద్దతిస్తామని పేర్కొన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా విజయవాడలో ఎంఐఎం బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఎంపీ కేశినేని మాట్లాడారు.

MP Kesineni Nani Slams BJP in Owaisi meeting
ఎంపీ కేశినేని నాని ప్రసంగం
author img

By

Published : Feb 18, 2020, 8:33 PM IST

ఎంపీ కేశినేని నాని ప్రసంగం

సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా విజయవాడలో ఎంఐఎం బహిరంగ సభ నిర్వహించింది. సభకు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. దేశాన్ని కుల, మత, ప్రాంతాల వారీగా విభజించే హక్కు ఎవరిచ్చారు..? అని కేశినేని ప్రశ్నించారు. దేశ ప్రజల ఐక్యత దెబ్బతినేలా కేంద్ర విధానాలు ఉన్నాయని ఆక్షేపించారు. ఎవరినీ సంప్రదించకుండానే ఆర్టికల్ 370 రద్దు చేశారని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తన పౌరసత్వం నిరూపించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'ప్రజలకు ఉపయోగపడే పథకాలను రద్దు చేశారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.