విజయవాడలో డ్రైనేజీ ఆధునీకరణ పనులు పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్‌సింగ్ పూరీని ఎంపీ కేశినేని నాని విజ్ఞప్తి చేశారు. బుధవారం దిల్లీలో కేంద్ర మంత్రితో కేశినేని భేటీ అయ్యారు. తెదేపా హయాంలో విజయవాడ డ్రైనేజీ ఆధునీకరణ పనులు 55 శాతం పనులు పూర్తయినట్లు మంత్రికి ఎంపీ తెలిపారు.
వైకాపా ప్రభుత్వం వచ్చాక 10 శాతం పనులూ చేయలేదని ఆరోపించారు. ఈ పనుల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను వేరే కార్యక్రమాలకు వినియోగించారని ఫిర్యాదు చేశారు. చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించడం లేదని చెప్పారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి: