సీఎం జగన్.. తన తాజా దిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కాళ్ళు పట్టుకుని వెనుతిరిగారని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. సొంత కేసుల మాఫీ కోసమే దిల్లీ పర్యటన తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఒక మాట తర్వాత మరో మాటతో జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోయారని నాని అన్నారు.
మాట తప్పను మడమ తిప్పను అని చెప్పుకొనే జగన్.. ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తానని ఎన్నికల ముందు ప్రకటించారని గుర్తు చేశారు. ఎన్నికలయ్యాక ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకుంది లేదని నాని విమర్శించారు. వ్యవసాయానికి మీటర్ల ఏర్పాటు రైతులపై భారం మోపేందుకేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెట్టం రఘురామ్‌ను విజయవాడ లోక్‌సభ నియజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జ్‌గా నియమించటం శుభపరిణామమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతుందని నాని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు మాట తప్పను, మడమ తిప్పనని జగన్ చెప్పారు. అధికారంలోకి వచ్చాక ప్రతి విషయంలోనూ మాట తప్పుతూనే ఉన్నారు. 20 మంది ఎంపీల్ని ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్నారు. అదీ లేదు. సీఎం జగన్ దిల్లీ పర్యటనలు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తప్ప.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. 16 నెలల పాలనలో రాష్ట్రాన్ని తిరోగతి పాలుచేశారు. -- కేశినేని నాని, విజయవాడ ఎంపీ
--
ఇవీ చదవండి: