రైతుల పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెదేపా ఎంపీ కనకమేడల(TDP MP KANAKAMEDALA) ధ్వజమెత్తారు. పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకపోతున్నారన్న విషయం మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలతో అర్థమౌతోందని ఆయన అన్నారు. పాదయాత్రలోని వారందరూ పెయిడ్ ఆర్టిస్టులు అయితే కంగారెందుకని.. రైతులపై అపవాదులు వేసి విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఎయిడెడ్ విద్యాసంస్థలపై స్పందిస్తూ విద్యావ్యవస్థకే ఎసరు పెట్టేలా నిర్ణయాలు ఉంటున్నాయని.. దానివల్ల విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థినులపైనా లాఠీఛార్జి చేసే పరిస్థితి తీసుకురావడాన్ని కనకమేడల తప్పుపట్టారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను స్వాధీనం చేసుకుంటారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమస్య పరిష్కరించాలని కోరితే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పాలన వైకాపా వచ్చిన నాటి నుంచి అస్తవ్యస్తంగా తయారైందని.. ఏపీఈఆర్‌సీని అడ్డం పెట్టుకుని ప్రజలపై భారం వేస్తారా అని నిలదీశారు. తప్పుడు విధానాలతో విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసి.. ప్రజలపై ట్రూ అప్ ఛార్జీల పేరుతో అదనపు భారాన్ని మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఈఆర్‌సీని నిలదీస్తే తప్ప నోటీసులు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
EMPLOYEES UNION: ఉద్యోగుల ఓట్లు అక్కర్లేదా..? ఈ నెలాఖరే డెడ్ లైన్