ETV Bharat / city

RAPE CASE: 'నా భర్తను శిక్షించండి.. కూతురికి న్యాయం చేయండి' - కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన భర్తను శిక్షించండి

కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడినందుకు తన భర్తను కఠినంగా శిక్షించాలని బాధిత బాలిక తల్లి కోరింది. తనపై కేసు వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని తెలిపింది. దిశ చట్టం కింద తన కూతురికి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. తనను వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయింది.

RAPE CASE
RAPE CASE
author img

By

Published : Sep 9, 2021, 6:24 PM IST

విజయవాడలో 6 ఏళ్ల బాలికపై కన్న తండ్రే అత్యాచారానికి ఒడిగట్టడం దారుణమని, బాలిక తండ్రిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లి మీడియా ముందు వాపోయింది. దిశా పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. మహిళా కమిషన్ బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి.. మెరుగైన వైద్యమందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలిపింది.

తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని భర్త బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాలిక తల్లి వాపోయింది. అసలు పెళ్లే కాలేదని చినబాబు అసత్య ప్రచారం చేస్తున్నాడని.. తమది ప్రేమ వివాహమని తెలిపింది. తనకు మద్దతిస్తున్న వారిపై చినబాబు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అక్రమంగా కేసులు పెట్టించి వేధిస్తున్నాడని చెప్పింది. దీనిపై ముఖ్యమంత్రి స్పందించి తనకు న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని కోరారు.

'నా భర్తను శిక్షించండి.. కూతురికి న్యాయం చేయండి'

''నా భర్త పెద్ద కూతురిపై(6) అత్యాచారానికి పాల్పడ్డారు. పాపను భయపెట్టడంతో ఆమె విషయాన్ని ముందుగా చెప్పలేదు. పాప ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చూపించాను. తరువాత పాప విషయాన్ని అమ్మమ్మకు తెలిపింది. తరువాత పాపను అడిగి విషయం తెలుసుకున్నాను. భర్త కుటుంబంలోని వారికి చెప్పినా న్యాయం జరగలేదు. ఉన్నత స్థానాల్లో ఉన్న వారందరూ భర్తకే సహకరిస్తున్నారు. కేసు నమోదు చేయకుండా ఆపేందుకు ప్రయత్నించారు. నాకు వేరే వారితే వివాహేతర సంబంధం ఉందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని బెదిరింపులకు గురిచేస్తున్నారు.'' - బాలిక తల్లి, విజయవాడ.

కన్న కూతురిపై అత్యాచారం ఒడిగట్టిన బాలిక తండ్రి చినబాబుపై తక్షణమే ఛార్జ్ షీట్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని డిమాండ్ చేశారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న బాలిక తండ్రి ఈ తరహా చర్యలకు పాల్పడటం విచారకరమన్నారు. దిశ చట్టంగా రూపుదాల్చకపోయినా బాధితులకు చెప్పిన విధంగా త్వరితగతిన న్యాయం చేయాలని కోరారు.

అసలు ఏం జరిగిందంటే..

ముక్కుపచ్చలారని చిన్నారి.. కన్నబిడ్డపై కన్నేశాడో కసాయి తండ్రి. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ కామాంధుడు చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కూతురు ఆరోగ్యం బాగోకపోవడంతో గుర్తించిన తల్లి చిట్టి తల్లీ ఏమైందంటూ ఆరా తీశారు. వచ్చీ రాని మాటలతో తండ్రి చేసిన అఘాయిత్యాన్ని చెప్పడంతో ఆ తల్లి ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. దాదాపు రెండున్నర నెలల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సభ్య సమాజం సిగ్గుపడేలా చేసినా ఈ అమానవీయ సంఘటన నున్న పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

నున్న పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసం ఉండే దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. భర్త నగరంలోని ఒక జాతీయ విద్యాసంస్థలో పీడీగా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా పెద్ద కుమార్తె (6)కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లి ఆమెను వైద్యుడి వద్దకు ఈ ఏడాది జూన్‌ 21న తీసుకెళ్లారు. వైద్యుడు పరీక్షించి మూత్ర సంబంధమైన ఇన్‌ఫెక్షన్‌ సోకి ఉండవచ్చని భావించి మందు ఇచ్చి పంపించారు. మందు వాడినా కూతురు ఆరోగ్యం కుదుటపడలేదు. ఏమైందంటూ కూతురును ప్రశ్నించిందా తల్లి. వచ్చీ రాని మాటలతో కన్న తండ్రి చేసిన పనులు చెప్పడంతో ఆ కామాంధుడి చేష్టలు వెలుగులోకి వచ్చాయి. బిడ్డపై తీవ్రస్థాయిలో లైంగిక వేధింపులతో పాటు అత్యాచారానికి పాల్పడిన భర్తను ఆమె నిలదీశారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అతడు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ నెల 4న మళ్లీ ఇంటికి వచ్చి కూతురును తీసుకెళ్లిపోతుండగా చిన్నారి అమ్మమ్మ అడ్డుకున్నారు. కంట్రోల్‌రూంకు ఫోన్‌ చేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ దిశ పోలీసు స్టేషన్‌లో నిందితుడిపై ఐపీసీ 376ఏబీ సెక్షన్‌, పోక్సో చట్టం కింద ఈ నెల 6న కేసు నమోదు చేశారు. చిన్నారిని విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో చేర్చి వైద్యపరీక్షలు చేశారు. నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతడిని న్యాయస్థానంలో హాజరు పరచగా రిమాండ్‌ విధించారు.

ఇదీ చదవండి:

MP RRR: సజ్జలపై చర్యలకు సీఎస్‌ను ఆదేశించండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.