గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జెండా చెట్టు బజారులో.. తాపీ మేస్త్రి చాంద్ బాషా నివాసముంటాడు. తన ఇంటి వరండాలో మంచం మీద సెల్ ఫోన్ పెట్టి పక్కకు వెళ్లగా.. ఇంతలో అక్కడికొచ్చిన కొండముచ్చు.. ఆ ఫోన్‌ను పట్టుకుని చెట్టెక్కేసింది. ఎంత ప్రయత్నించినా కొండముచ్చు ఫోన్ వదల్లేదు. చేసేదేమీ లేక చాంద్ బాషా పోలీసులను ఆశ్రయించాడు. తన సెల్‌ఫోన్‌ను కొండముచ్చు ఎత్తుకుపోయిందని ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుతో కంగుతిన్న పోలీసులు ఫోన్ ఎలా తీసుకురావాలా అని తలలు పట్టుకున్నారు.
ఇదీ చదవండి: