తెదేపా అధినేత చంద్రబాబు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు డిమాండ్ చేశారు. తెదేపా కార్యకర్తలు గుడిలో కొట్టిన కొబ్బరి చిప్పలు ఏరుకోవడానికి వెల్లంపల్లి రామతీర్థం వెళ్తున్నాడని విమర్శించారు
భూ భక్షుకుడైన వెల్లంపల్లి... భూదానం చేసిన అశోక్ గజపతిరాజును ఏకవచనంతో మాట్లాడడాన్ని తప్పుబట్టారు. 19 నెలలుగా రాష్ట్రంలో 125 దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్కరిని కూడా ఎందుకు పట్టుకోలేదని నిలదీశారు. వెల్లంపల్లి తన అసమర్థతకు మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి అయ్యాక వేలాది ఎకరాల మాన్యం భూములు అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. దుర్గగుడిలో వెండి సింహాలు మంత్రి కనుసనల్లోనే మాయమయ్యాయని మంతెన ఆరోపించారు.
ఇదీ చదవండి: