ETV Bharat / city

సంక్రాంతి నాటికి గృహాలు పంపిణీ చేయాలి: బచ్చుల అర్జునుడు - ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

తెదేపా హయాంలో పేద ప్రజల కోసం నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు అందజేయకపోవటంపై ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో వైకాపా ప్రభుత్వం ఉచితంగా గృహాలు ఇస్తామని నిరుపేదలను నమ్మించిందన్నారు. సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే... లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలను ఆక్రమిస్తామని హెచ్చరించారు.

mlc bachula arjunudu fires on ycp on giving houses to beneficiaries
సంక్రాంతి నాటికి నిరుపేదలకు గృహాలు పంపిణీ చేయాలి: బచ్చుల అర్జునుడు
author img

By

Published : Nov 8, 2020, 5:19 PM IST

తెదేపా ప్రభుత్వ హయాంలో నిరుపేద ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మించిన గృహాలను.. లబ్ధిదారులకు ఇవ్వడానికి సర్వం సిద్ధమైన సమయంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో వైకాపా ఉచితంగా గృహాలు ఇస్తామని నమ్మించారని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ ఒక్క లబ్ధిదారునికి ఇళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో లబ్ధిదారులకు సెంట్ చొప్పున ఇస్తామని అని చెప్పి.. తెదేపా తమ ప్రభుత్వానికి అడ్డు వస్తుందంటూ సీఎం జగన్, మంత్రులు చెప్పడం దుర్మార్గమన్నారు. కోర్టుల్లో ఉన్న అరకొర భూమిని భూతద్దంలో చూపిస్తూ వ్యవహారం మొత్తం కోర్టుల్లో ఉందని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.

లబ్ధిదారులకు సెంటున్నర చొప్పున.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రెండు సెంట్ల చొప్పున భూములు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే... లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలను ఆక్రమిస్తామని బచ్చుల హెచ్చరించారు.

ఇదీ చదవండి:

కుటుంబం ఆత్మహత్య కేసు: నంద్యాలకు చేరుకున్న విచారణ కమిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.