జాతీయ విద్యావిధానం-సంస్కరణలపై మంత్రులు ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాఖల స్థాయిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్, మునిసిపల్, బీసీ సంక్షేమం, గిరిజన, మైనారిటీ పాఠశాలల్లో నూతన విద్యా విధానం అమలు అంశంపై ఉన్నతాధికారులతో చర్చించారు. జాతీయ విద్యావిధానం-2020లో పూర్వప్రాథమిక విద్యపైనే ప్రధాన దృష్టి ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 5+3+4 విధానంలో విద్యా బోధన ఉంటుందని తెలిపారు. ప్రభుత్వంలోని వివిధ యాజమాన్యాల కింద నడుస్తున్న పాఠశాలలన్నీ ఇక నుంచి ఆరు వర్గీకరణలతో కూడిన పాఠశాలలుగా నడిపేలా కొత్త సంస్కరణలు అమలవుతాయని మంత్రి సురేష్ తెలిపారు.
నాణ్యమైన విద్యను అందించేలా నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. పైలట్ స్థాయిలో కృష్ణా జిల్లాలో నూతన విద్యావిధానం సంస్కరణలు మొదలయ్యాయన్నారు. నాణ్యమైన విద్యను అందించటంలో సంస్కరణలను అమలు చేయటంలో ఏపీ ముందుందని.. తెలంగాణా కూడా ఏపీలోని విద్యాబోధన అంశాలను పరిశీలించి తమ రాష్ట్రంలో అమలు చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
ఇదీచదవండి.