విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్లో వైకాపా కార్పొరేటర్ అభ్యర్థి రాజేశ్‌తో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం రావాలంటే..వైకాపా బలపర్చిన అభ్యర్థులను గెలిపించి సీఎం జగన్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ సంక్షేమానికి నిబద్ధతతో పని చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు.
ఇదీచదవండి