'సీవీ రెడ్డి ఛారిటీస్' వ్యవస్థాపకులు చుండూరు వెంకటరెడ్డి 40వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ విజయవాడలో నిర్వహించారు. ఆయన విగ్రహానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పూలమాల వేశారు. ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి సేవ చేశారని మంత్రి కొనియాడారు. దాదాపు 100 మంది పేద, వేద విద్యార్థులకు స్కాలర్ షిప్పులు.. మరో 100 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 500 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం ఛైర్మన్, ఈవో తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
'చిత్తూరు, గుంటూరు జిల్లాలకు కలెక్టర్లుగా ఆ ఇద్దరిని నియమించండి'