విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పనులను దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చే ఈ వంతెనను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కృష్ణా పుష్కరాల నాటికే పై వంతెనను అందుబాటులోకి తెస్తామన్న చంద్రబాబు.. సకాలంలో నిధులు మంజూరు చేయకుండా మాటలతో కాలయాపన చేశారని విమర్శించారు.
జగన్ సీఎం అయ్యాక బెంజిసర్కిల్, కనకదుర్ ఫ్లైఓవర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారని.. ఇప్పటికే బెంజిసర్కిల్ పైవంతెన అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లకు విజయవాడ అభివృద్ధి ఇప్పుడు గుర్తొచ్చిందా అని ఎద్దేవా చేశారు. తెదేపా హయాంలో చంద్రబాబు చేత నిధులు ఎందుకు మంజూరు చేయించుకోలేకపోయారని ప్రశ్నించారు. ఎంపీగా నగర అభివృద్ధికి నాని ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి...