విజయవాడ నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. 49వ డివిజన్ ఫైజరుపేట తెలుగు బాప్టిస్టు చర్చి కూడలిలో రూ.40 లక్షల అంచనా వ్యయంతో యుజీడీ పనులుకు, చిట్టినగర్ సొరంగం వద్ద రూ.1.25 కోట్లతో నిర్మించనున్న జీఎస్ఎల్ఆర్ వాటర్ ట్యాంకు పనులుకు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు.
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విజయవాడను మోడల్ నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుందని వెల్లంపల్లి అన్నారు. ఇప్పటికే రూ.600 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జనసేన నాయకులు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని... వారికి ప్రజల్లో ఆదరణ లేదని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: