ETV Bharat / city

Environment day: విజయవాడలో మెుక్కలు నాటిన మంత్రి వెల్లంపల్లి - విజయవాడ వార్తలు

గృహలు, గృహ సముదాయాల ముందు మొక్కలు పెంచుకునేందుకు.. ఆసక్తి చూపే ప్రజలకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరుపున తామే అందజేస్తామని.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు.

Minister Vellampalli
Minister Vellampalli
author img

By

Published : Jun 5, 2021, 12:26 PM IST

పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో భాగంగా.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. నగర వ్యాప్తంగా పచ్చదనం- పరిశుభ్రతకి ప్రధాన పీట వేస్తున్నామన్నారు. ఎవరైనా ఇళ్లు, గృహ సముదాయాల ముందు మొక్కలు పెంచుకోవడానికి ఆసక్తి చూపితే.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరపున తామే అందజేస్తామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. విజయవాడ నగర పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక ప్రాతిపదికన నిర్వహించబోతున్నామని నగర మేయర్ భాగ్యలక్ష్మి తెలిపారు..

ఇదీ చదవండి: Kalipatnam Rama Rao: కథా సాహిత్య దీపధారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.