ETV Bharat / city

Perni-RGV Meet: ఈనెల 10న మంత్రి పేర్ని నానితో రాంగోపాల్ వర్మ భేటీ - రాంగోపాల్ వర్మ న్యూస్

Perni RGV Meet: సినిమా టికెట్ల వ్యవహారంపై పేర్ని నానితో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈనెల 10న సచివాలయంలో భేటీ కానున్నారు. టికెట్ల వ్యవహారంపై ఇటీవల ట్విటర్‌లో మంత్రి పేర్ని నాని, రాంగోపాల్ వర్మల మధ్య వాడీవేడీ చర్చ జరిగిన ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈనెల 10న మంత్రి పేర్ని నానితో రాం గోపాల్ వర్మ భేటీ

author img

By

Published : Jan 7, 2022, 9:50 PM IST

Updated : Jan 7, 2022, 11:25 PM IST

Perni RGV Meet: ఈనెల 10న సచివాలయంలో మంత్రి పేర్ని నానితో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటీ కానున్నారు. సినిమా టికెట్ల వ్యవహారంపై పేర్ని నానితో వర్మ మాట్లాడనున్నారు. టికెట్ల వ్యవహారంపై ఇటీవల ట్విటర్‌లో మంత్రి పేర్ని నాని, రాంగోపాల్ వర్మల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆర్జీవీ వర్సెస్ మంత్రులు..

సినిమా టికెట్ల అంశంపై ఏపీ మంత్రులు వర్సెస్ ఆర్జీవీ అన్నట్లుగా గత కొంత కాలంగా ట్వీట్ వార్ కొనసాగుతూనే ఉంది. ఇటీవల మంత్రి పేర్ని నానిని కలిసేందుకు ఆర్జీవీ అనుమతి కోరారు. మంత్రి అనుమతిస్తే తమ సమస్యలు వివరిస్తానని చెప్పారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానని ట్వీట్​ చేశారు. ప్రభుత్వంతో గొడవకు దిగాలనేది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

ఆర్జీవీ చేసిన విజ్ఞప్తికి.. మంత్రి పేర్ని నాని కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. "ఆర్జీవీకి ధన్యవాదాలు.. తప్పకుండా త్వరలో కలుద్దాం" అంటూ.. రిప్లే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని ఈనెల 10న అపాయింట్​మెంట్ ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ ప్రశ్నలు..

RGV Comments: సినిమా టికెట్ల విషయంలో మంత్రి పేర్ని నాని, ఆర్జీవీ(RGV) మధ్య ఇటీవల ట్విటర్ వార్ కొనసాగింది. టికెట్ రేట్లు తగ్గించడాన్ని తప్పుబట్టిన వర్మ.. ముడి పదార్థం రూ.500 కూడా ఖర్చవ్వని పెయింటింగ్‌ని.. కొనేవాడుంటే ఐదు కోట్లకూ అమ్ముతారని అన్నారు. ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే బ్రాండ్‌కి, ఆలోచనకు ఎలా వెలకడతారని ప్రశ్నించారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంకా బాగుండాలంటే ఏం చేయాలన్నది కొనుగోలుదారుడే నిర్ణయిస్తాడని తేల్చి చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్ ప్రభుత్వానికి తెలియకుండా చేసే నేరమన్న ఆర్జీవీ.. ప్రభుత్వానికి చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం కల్పించుకోవాల్సి విపరీత పరిస్థితి ప్రస్తుతం లేదని బదులిచ్చారు. పరస్పర అంగీకార లావాదేవీలకు లూటీ అనే పదం సరికాదని హితవు పలికారు. మొదటి నుంచి థియేటర్లు వ్యాపార సంస్థలు మాత్రమేనన్న ఆర్జీవీ.. ప్రజాసేవ కోసం ఎవరూ థియేటర్లు పెట్టలేదని స్పష్టం చేశారు. థియేటర్లనేవి ప్రజా కోణంలో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. కావాలంటే మీ గవర్నమెంట్​లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి అన్నారు. మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి ఆ డెఫినిషన్(లూటీ) మీకు మీరు ఇచ్చుకుంటున్నారని ట్వీట్ చేశారు.

'వి ఎపిక్‌' థియేటర్‌కు ఏరియాను బట్టి టికెట్ రేటు ఎలా పెట్టారని ప్రశ్నించారు. టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని నిలదీశారు. పవన్ సినిమాకు సంపూర్ణేష్ సినిమాకి వ్యత్యాసం తెలియదా అని ప్రశ్నించిన రాంగోపాల్ వర్మ.. మంత్రిగా మీకు.. మీ డ్రైవర్‌కు కూడా తేడా లేదా? అని సూటిగా ప‌్రశ్నించారు.

అది అమ్మేవాడి నమ్మకం.. కొనేవాడి అవసరం

"హీరో నాని..చాలా మంది లీడర్లలా పరుష పదజాలంతో మాట్లాడకుండా డిగ్నిటీతో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక విషయానికి వస్తే.. వంద రూపాయల టికెట్.. వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదు. అది అమ్మేవాడి నమ్మకం..కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది. కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే ట్రాన్స్పరెన్సీ మాత్రమే ప్రభుత్వాలకు అవసరం. బ్లాక్ మార్కెటింగ్ అనేది గవర్నమెంట్​కి తెలియకుండా చేసే క్రైమ్. ఓపెన్​గా ఎంతకి అమ్ముతున్నాడో చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుంది." అన్నారు.

మీ పార్టీ కార్యకర్త.. మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడు..

"థియేటర్లనేవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు. సొసైటీ ఆధునీకతకు ముఖ్య కారణం మోటివేషన్. ఎందుకంటే.. ప్రతి మనిషి కూడా మానవ సహజంగా తను ఉన్న పొజిషన్ కన్నా పైకి ఎదగాలని కోరుకుంటాడు. పేదవాడు ధనికుడవ్వాలని కోరుకుంటాడు. మీ పార్టీ కార్యకర్త.. మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడు. మీ ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అవ్వాలని కోరుకుంటాడు." అని ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు.

పేదల్ని ధనికుల్ని చెయాలే కానీ.. ధనికుల్ని పేదలుగా చేయకూడదు..

"పేదల కోసం చేయడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు. అయితే.. పేదల్ని ధనికుల్ని చేయడానికి మీ ప్రభుత్వం పని చేయాలి కానీ.. ఉన్న నికుల్ని పేదల్ని చేయకూడదు. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కల్లా పేద రాష్ట్రం అయ్యే ప్రమాదముంది. నాని గారు.. నేను ఒక యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్​ని.. ఎకనామిక్స్ గురించి నాకు ఏమీ తెలియదు. కానీ మీరు అనుమతిస్తే మీ ప్రభుత్వంలో ఉన్న టాప్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్​తో నేను టీవీ డిబేట్​కి రెడీ. మా సినిమా ఇండస్ట్రీకి మీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ ఈ వివాదాన్ని తొలగిపోవడానికి ఇది చాలా అవసరమని నా అభిప్రాయం" - ఆర్జీవీ, దర్శకుడు

కొడాలి నానిపై ఆర్జీవీ సెటైర్...!

Ram gopal Varma comments on kodali nani: ఏపీ మంత్రి కొడాలి నాని ఎవరో తనకు తెలియదని.. కేవలం సినిమా హీరో నాని మాత్రమే తనకు తెలుసని రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. సినిమా టికెట్ ధరలపై తాను అడిగిన ప్రశ్నలకు కొడాలి నాని ఇచ్చిన కౌంటర్​పై స్పందించాలని కొందరు కోరుతున్నారని ట్వీట్ చేశారు. తనకు నేచురల్ స్టార్ నాని ఒక్కడే తెలుసని.. కొడాలి నాని ఎవరో తెలియదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల విషయంపై నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్‌కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని సినిమా హీరో.. నేచురల్‌ స్టార్‌ నాని ఒక్కడే. వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు" - ఆర్జీవీ , ప్రముఖ దర్శకుడు

నాడు మంత్రి అనిల్.. నేడు ఆర్జీవీ

‘శ్యామ్‌సింగరాయ్‌’ సినిమా రిలీజ్‌ సమయంలో టికెట్‌ ధరలపై హీరో నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దానిపై స్పందించిన మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌.. ‘‘నాకు కొడాలి నాని ఒక్కరే తెలుసు. ఈ నాని ఎవరో నాకు తెలీదు’’ అన్నారు. ఇదే తరహాలో ఆర్జీవీ కౌంటర్‌ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఆ కాసేపటికే.. తాను కలిసేందుకు మంత్రి పేర్ని నాని టైం ఇవ్వాలని కోరుతూ ట్వీట్ చేయటం.. పేర్ని నాని బదులివ్వటం చకచక జరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో ఈనెల 10న జరగనున్న మంత్రి పేర్ని,ఆర్జీవీ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చదవండి

RGV vs Perni Nani: "మంత్రిగారూ.. టైమ్ ఇస్తే కలుస్తా" తప్పకుండా.. త్వరలోనే కలుద్దాం!

Last Updated : Jan 7, 2022, 11:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.