రాష్ట్రంలో నాటక కంపెనీలు లేని లోటు తెదేపా తీర్చిందని మంత్రి పేర్ని నాని విమర్శించారు. తెదేపా నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఓ డ్రామా అని అన్నారు. మాక్ అసెంబ్లీలో మహానటులంతా కనిపించారని విమర్శించారు. బడ్జెట్‌పై పవన్ కల్యాణ్ విమర్శలు అర్థరహితమని పేర్ని నాని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌కు ప్రవృత్తి రాజకీయాలని, వృత్తి నటన అని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్ర బడ్జెట్ రూ.2,29,779 కోట్లు.. సంక్షేమ పథకాలకు పెద్దపీట