ETV Bharat / city

Minister Peddi Reddy: ఆ పరిశ్రమలపై కేసులు పెట్టండి: మంత్రి

author img

By

Published : Nov 1, 2021, 10:51 PM IST

ఇష్టారాజ్యంగా భూగర్భజలాలను వినియోగించే పరిశ్రమలపై కేసులు నమోదు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న భూగర్భ జలాలపై ఛార్జీల విధింపు అంశాన్ని పరిశీలించాలన్నారు.

ఇష్టారాజ్యంగా భూగర్భజలాలను వినియోగించే పరిశ్రమలపై కేసులు

రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు నిబంధనలకు వ్యతిరేకంగా భూగర్భ జలాలు వినియోగిస్తున్నాయని..,ఈ అంశంపై దృష్టి పెట్టాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో వాల్టా చట్టంపై మంత్రి పెద్దిరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ (సీఇడబ్ల్యూఏ) నిబంధనల అమలుపై మంత్రి ఆరా తీశారు. ఇష్టారాజ్యంగా భూగర్భజలాలను వినియోగించే పరిశ్రమలపై కేసులు నమోదు చేయాలని సూచించారు.

పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న భూగర్భ జలాలపై ఛార్జీల విధింపు అంశాన్ని పరిశీలించాలన్నారు. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఛార్జీల ఖరారులో పరిశ్రమలపై ఎక్కువ భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

భూగర్భ జలాలను వినియోగించే చిన్న పరిశ్రమల పట్ల ఉదారంగా వ్యవహరించాలని మంత్రి అధికారులకు సూచించారు. జాతీయ స్థాయిలో భూగర్భ జలాల వినియోగంపై కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ వాల్టా చట్టంలో కూడా అవసరమైన మార్పులు తీసుకురావాలన్నారు. తాగునీటి అవసరాలు, వ్యవసాయం కోసం వినియోగించే భూగర్భ జలాల విషయంలో ఎటువంటి ఛార్జీలను విధించకూడదని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

DGP On Drugs: ఏపీలో డ్రగ్స్ లేవు: డీజీపీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.